ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prime Minister Narendra Modi : దేశం గర్విస్తోంది..

ABN, First Publish Date - 2023-08-24T02:35:33+05:30

చంద్రయాన్‌-3 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మోదీ.. బుధవారం విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఘట్టాన్ని

చంద్రయాన్‌-3 విజయవంతమైన మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోంది. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం. దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు.

- మోదీ

సరికొత్త చరిత్రను లిఖించాం: మోదీ

శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు: ముర్ము

శాస్త్రవేత్తలకు అభినందనలు: సీజేఐ

బెంగళూరు/న్యూఢిల్లీ, ఆగస్టు 23: చంద్రయాన్‌-3 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మోదీ.. బుధవారం విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఘట్టాన్ని జొహాన్నె్‌సబర్గ్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని.. ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ భారతికి ఫోన్‌ చేసి అభినందించారు. త్వరలోనే తాను బెంగళూరుకు వచ్చిన ఇస్రో బృందాన్ని కలుస్తానని చెప్పారు. కాగా, చంద్రయాన్‌-3ని విజయవంతం చేయడం ద్వారా భారత శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఇలాంటి మహత్తర ఘట్టాన్ని చూసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందన్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ అభినందిస్తున్నట్లు తెలిపారు.

భారతీయులందరి విజయం: కాంగ్రెస్‌

చంద్రయాన్‌-3 విజయవంతం కావడం భారతీయులందరి సమష్టి విజయమని కాంగ్రెస్‌ పేర్కొంది. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆరు దశాబ్దాల అంతరిక్ష ప్రయోగ చరిత్రలో ప్రపంచమంతా ఇస్రోవైపు చూసేలా చేశామని, ఇవి భారతీయులందరూ గర్వపడే క్షణాలని తెలిపారు. కాగా, శాస్త్రవేత్తల శ్రమకు ఫలితమే చంద్రయాన్‌-3 విజయమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఇదో చారిత్రక విజయం: సీజేఐ

ఇదొక చారిత్రక విజయమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఈరోజు చంద్రయాన్‌-3 విజయవంతం కావడం చూసి భారత పౌరుడిగా ఎంతో గర్వపడుతున్నాను. ఇది ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధ్రువంపైకి వెళ్లిన ఏకైక దేశంగా భారత్‌ అవతరించింది. కొత్త మార్గాలు, శాస్త్రీయ పరిశోధన, మరెన్నో ఆవిష్కరణలకు ఇది సాయపడుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు నిజంగా దేశం గర్వించేలా చేశారు’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఇప్పటికే అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. గొప్ప దేశానికి ఇది మరో అపూర్వ విజయం.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌-3 విజయంవతం కావడంపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ఇస్రో మాజీ చీఫ్‌ మాధవన్‌ నాయర్‌, దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ‘‘చంద్రయాన్‌-3 విజయం సాధించడంతో దేశం మొత్తం సంతోషిస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు చరిత్ర లిఖించారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో విజయం సాధించి భరతమాత గర్వపడేలా చేశారు’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. ఇక కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, సీఎం ఎంకే స్టాలిన్‌, పుదుచ్చెరి సీఎం రంగసామి, అసెంబ్లీ స్పీకర్‌ ఆర్‌.సెల్వం ఆయా రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ఇస్రో విజయాన్ని ప్రశంసించారు.

Updated Date - 2023-08-24T02:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising