Share News

Rajasthan Assembly polls: 68.70 పోలింగ్ శాతం నమోదు..

ABN , First Publish Date - 2023-11-25T21:05:48+05:30 IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌కు వీలు కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

Rajasthan Assembly polls: 68.70 పోలింగ్ శాతం నమోదు..

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly polls) భారీగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 6 గంటల తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటింగ్‌కు వీలు కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 అసెంబ్లీ స్థానాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా, ఒకటి, రెండు రాళ్లు రువ్వుకున్న సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు.


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 1862 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, 5 కోట్ల 29 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఈసారి 22 లక్షల 61 వేల మందికి ఓటు హక్కు లభించింది. 3 లక్షల మంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 51,890 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,74,000 మంది ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించగా, 1,71,000 మంది పోలీసు, భద్రతా సిబ్బంది మోహరించారు. ఈసారి ఎన్నికల బరిలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింగ్ సింగ్ డోటస్రా, విధాన సభ స్పీకర్, కాంగ్రెస్ నేత సీపీ జోషి తదితర హేమాహేమీలు ఉన్నారు. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయ.

Updated Date - 2023-11-25T21:05:49+05:30 IST