Rajasthan Cabinet: 22 కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
ABN, Publish Date - Dec 30 , 2023 | 07:24 PM
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం శనివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించింది. కొత్తగా 22 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు.
జైపూర్: ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) సారథ్యంలోని రాజస్థాన్ (Rajasthan) ప్రభుత్వం శనివారంనాడు మంత్రివర్గాన్ని విస్తరించింది. కొత్తగా 22 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. వీరిలో 12 మంది క్యాబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులు ఉన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
కాగా, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో మీనా, మదన్ దిలావర్, రాథోర్, గజేంద్ర సింగ్ ఖింసర్, బాబులాల్ ఖరాడి, జోగరామ్ పటేల్, సురేష్ సింగ్ రావత్, అవినాష్ గెహ్లాట్, జోరారామ్ కుమావత్, హేమంత్ మీనా, కన్హయ్య లాల్ చౌదరి, సుమిత్ గోదార ఉన్నారు. సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ చార్జి)గా ప్రమాణస్వీకారం చేసిన వారిలో సంజయ్ శర్మ, గౌతమ్ కుమార్ డక్, జబర్ సింగ్ ఖర్రా, సురేంద్ర పాల్ సింగ్, హీరాలాల్ నగర్ ఉన్నారు. కాగా, ఓతారామ్ దేవసి,మంజు బాగ్మర్, విజయ్ సింగ్ చౌదరి, కేకే విష్ణోయ్, జవహర్ సింగ్ బేధమ్‌లు సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 115 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 స్థానాలు దక్కించుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా డిసెంబర్ 15న ప్రమాణస్వీకారం చేశారు.
Updated Date - Dec 30 , 2023 | 07:31 PM