Rajasthan Assembly Election: కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత
ABN , First Publish Date - 2023-11-15T11:58:50+05:30 IST
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు.
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ (Karanpur) అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ (Gurmeet Singh kooner) అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు. 75 ఏళ్ల కూనెర్ ప్రస్తుతం కరణ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈనెల 12న ఆయన ఎయిమ్స్‌లో చేరారు.
హైపర్‌టెన్సన్, మూత్రపిండాలు దెబ్బతినడంతో కూనెర్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్‌లో పేర్కొంది. గుర్మీత్ సింగ్ కూనెర్ మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కూనెర్ కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న పోలింగ్ జరుగనుంది.