ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan Assembly Election: కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత

ABN, First Publish Date - 2023-11-15T11:58:50+05:30

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కరణ్‌పూర్ (Karanpur) అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కూనెర్ (Gurmeet Singh kooner) అస్వస్థతతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టు పార్టీ నేతలు బుధవారం తెలిపారు. 75 ఏళ్ల కూనెర్ ప్రస్తుతం కరణ్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈనెల 12న ఆయన ఎయిమ్స్‌లో చేరారు.


హైపర్‌టెన్సన్, మూత్రపిండాలు దెబ్బతినడంతో కూనెర్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ జారీ చేసిన డెత్ సర్టిఫికెట్‌లో పేర్కొంది. గుర్మీత్ సింగ్ కూనెర్ మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలియజేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. కూనెర్ కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 200 స్థానాలున్న రాజస్థాన్‌ అసెంబ్లీకి నవంబర్ 25న పోలింగ్ జరుగనుంది.

Updated Date - 2023-11-15T12:00:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising