ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajasthan Assemly polls: రికార్డు స్థాయి పోలింగ్ దిశగా...

ABN, First Publish Date - 2023-11-25T17:59:18+05:30

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 55.63 శాతంగా నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Rajasthan Assembly polls) చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరుగుతోంది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 55.63 శాతంగా నమోదైనట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. తిజార నియోజకవర్గంలో 69.73 శాతం, టోంక్ నియోజకవర్గంలో 56.83 శాతం పోలింగ్ జరిగింది. రాజధాని నగరం జైపూర్‌లో 55.75 శాతం, జైసల్మేర్‌లో 63.48, ఝాలవార్‌లో 60.47 శాతం, హనుమాన్ గఢ్‌లో 61.64 శాతం, జలోర్‌లో 52.23 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుండటంతో పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తు్న్నారు.


అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేసింది. 1,02,290 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. 69,114 మంది పోలీసు సిబ్బంది, 32,876 మంది రాజస్థా్న్ హోమ్‌గార్డులు, ఆర్ఎసీ సిబ్బంది, 700 కంపెనీల సీఏపీఎఫ్ విధుల్లో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ ఇటీవల కన్నుమూయడంతో కరణ్‌పూర్ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. దీంతో 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-11-25T17:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising