Rajasthan CM: రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? రేసులో ఉన్న వారిలో యోగి బాలక్‌నాథ్‌కే ఛాన్స్?
ABN, First Publish Date - 2023-12-04T10:31:10+05:30
ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణలో గతంలో కంటే బాగా పుంజుకుంది. రాజస్థాన్‌లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తుందనేది చాలా ఆసక్తిగా మారింది.
ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణలో గతంలో కంటే బాగా పుంజుకుంది. రాజస్థాన్‌లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ (BJP) ఎవరిని ముఖ్యమంత్రిగా నియమిస్తుందనేది చాలా ఆసక్తిగా మారింది. ముఖ్యమంత్రి రేసులో పలువురు అభ్యర్థులు ఉన్నారు (Rajasthan CM). వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బాబా బాలక్‌నాథ్, దియా కుమారి (Election Results).
బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయ్ రాజే సింధియా కుమార్తె అయిన వసుంధరా రాజే (Vasundhara Raje) రాజస్థాన్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1984లో బీజేపీలో చేరిన వసుంధర ధోల్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు. ఆమె ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు బీజేపీని విజయ తీరాలకు చేర్చారు.
యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరు తెచ్చుకున్న బాబా బాలక్‌నాథ్ (Baba Balaknath) కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బాలక్‌నాథ్ బరిలోకి దిగి గెలుపొందారు. 40 ఏళ్ల బాలక్‌నాథ్ 1984లో బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో యాదవ కుటుంబంలో జన్మించారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్ మఠానికి బాలక్‌నాథ్ ఎనిమిదో మహంత్. బాలక్‌నాథ్ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు.
జైపూర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి (Diya Kumari) కూడా ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో ఉన్నారు. 2013లో బీజేపీలో చేరినప్పటి నుంచి దియా వరుసగా మూడోసారి గెలుపొందారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో ఆమె అనేక అభివృద్ధి పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 2019లో ఆమె ఏకంగా 5 లక్షల పైచిలుకు మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. వీరు మాత్రమే కాకుండా గజేంద్ర సింగ్ షెకావత్, కిరోరీ మాల్ మీనా, సీపీ జోషీ కూడా ముఖ్యమంత్ర పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
Updated Date - 2023-12-04T10:31:12+05:30 IST