ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Return travel: తిరుగు ప్రయాణికులతో కిటకిటలాడిన బస్టాండ్లు

ABN, First Publish Date - 2023-11-15T11:26:36+05:30

దీపావళి పండుగ(Diwali festival) కోసం తమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సోమవారం రాత్రి నుంచి చెన్నైకి తిరుముఖం పట్టారు.

- రైల్వే స్టేషన్లలోనూ అదే తంతు

అడయార్‌(చెన్నై): దీపావళి పండుగ(Diwali festival) కోసం తమ సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు సోమవారం రాత్రి నుంచి చెన్నైకి తిరుముఖం పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడగా, రహదారులు వాహనాలతో కిక్కిరిసి కనిపించాయి. ముఖ్యంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు రెండు మూడు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే, బస్సులు, రైళ్లలో(Buses and trains) నగరానికి చేరుకున్న ప్రయాణికులు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారనంగా తమతమ గృహాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. దీపావళి పండుగ కోసం ఈ నెల 9వ తేదీ నుంచి నగరవాసులు తమతమ సొంతూళ్లకు పయనమయ్యారు. వీరికోసం కోయంబేడుతో పాటు మాధవరం, తాంబరం, కేకేనగర్‌, పూందమల్లి బైపాస్‌, తాంబరం మెప్స్‌ తదితర బస్టాండుల నుంచి రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ బస్సుల ద్వారా దాదాపు 10 లక్షల మంది వరకు నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్లినట్టు అంచనా. ఇపుడు దీపావళి సెలవులు ముగిసిపోవడంతో మంగళవారం నుంచి అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్ళిన వారంతా తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. వీరికోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర రవాణా శాఖ రోజువారీ బస్సు సర్వీసులతో పాటు అదనంగా వేల సంఖ్యలో బస్సులను నడిపింది. అలాగే, చెన్నైకి వచ్చిన రైళ్లన్నీ తీవ్రమైన రద్దీతో రావడంతో ప్రయాణికులతో కిటకిటలాడాయి. నగరానికి వచ్చే వాహనాలతో మంగళవారం వేకువజాము నుంచి మరైమలర్‌ నగర్‌, సింగపెరుమాళ్‌ కోయిల్‌, గూడువాంజేరి, వండలూరు, పెరంగళత్తూరు, తాంబరం, క్రోంపేట, పల్లావరం, గిండిలతో పాటు పూందమల్లి, మదురవాయల్‌, నజరత్‌పేట తదితరు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

నేడు ప్రత్యేక బస్సులు

దీపావళి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్ళిన వారు తిరిగి నగరానికి చేరుకునేందుకు రాష్ట్ర రవాణా శాఖ బుధవారం కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రతి రోజూ నడిచే 2100 బస్సులతో కలుపుకుని మొత్తం 3167 బస్సులను నడిపేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం 1275 ప్రత్యేక బస్సులను నడిపిన నేపథ్యంలో మంగళవారం 975 బస్సులను నడిపారు. అలాగే, బుధవారం 917 బస్సులను నడుపనున్నారు.

Updated Date - 2023-11-15T11:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising