Amit sha: అసోం పర్యటనకు అమిత్‌షా.. గౌహతిలో 144 సెక్షన్

ABN , First Publish Date - 2023-05-22T12:17:10+05:30 IST

కేంద్రం హోం మంత్రి అమిత్‌షా రెండు రోజుల అసోం పర్యటన నేపథ్యంలో గౌహతిలో 144 సెక్షన్‌ విధిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, గ్రూపులు రాబోయే రోజుల్లో గౌహతి సిటీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కార్యాలయాలు, ప్రజారవాణాను స్తంభింపజేయవచ్చనే సమాచారం మేరకు నిషేధాజ్ఞాలను విధించినట్టు పోలీస్ కమినర్ దిగంత్ బారాహ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Amit sha: అసోం పర్యటనకు అమిత్‌షా.. గౌహతిలో 144 సెక్షన్

గౌహతి: కేంద్రం హోం మంత్రి అమిత్‌షా (Amit shah) రెండు రోజుల అసోం (Assam) పర్యటన నేపథ్యంలో గౌహతిలో 144 సెక్షన్‌ విధిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, గ్రూపులు రాబోయే రోజుల్లో గౌహతి సిటీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కార్యాలయాలు, ప్రజారవాణాను స్తంభింపజేయవచ్చనే సమాచారం మేరకు నిషేధాజ్ఞాలను విధించినట్టు పోలీస్ కమినర్ దిగంత్ బారాహ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు మించి ఒక చోట గుమిగూడటం కానీ, నినాదాలు చేయడం గానీ నిషేధించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన చెప్పారు.

అమిత్‌షా రెండు రోజుల పర్యటనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది. అమిత్‌షా తన పర్యటనలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తారని, 45,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారని మంత్రివర్గ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు చెప్పారు. అమిత్‌షా ఈనెల 24, 24 తేదీల్లో అసోంలో పర్యటించనున్నారు.

Updated Date - 2023-05-22T12:20:47+05:30 IST