Sharad Pawar: మేం ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకుంటే మార్పు తీసుకురాగలం
ABN, First Publish Date - 2023-07-31T10:57:54+05:30
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
ముంబై: తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్(Nationalist Congress Party president Sharad Pawar) అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కానీ తాము ముగ్గురం(ఎంవీఏ సభ్యులు) కలిసి నిర్ణయించుకుంటే మహారాష్ట్రలో మార్పు ఉండవచ్చని ఆయన అన్నారు. కాగా మహా వికాస్ అఘాడీ(Maha Vikas Aghadi) కూటమిలోని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్‌లతో కలిసి శరద్ పవార్ ఆదివారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పురాతన కళలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్ర పరిరక్షణలో గత ప్రభుత్వాలు ఎలా సహాయపడ్డాయో పవార్ గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా తాను నేతృత్వం వహిస్తున్న యశ్వంతరావు చవాన్ ప్రతిష్టాన్.. పుస్తకాలను ప్రచురించిన రాజవాడే ఇతిహాస్ సంశోధక్ మండల్‌కు రూ.50 లక్షలు ఇస్తుందని ప్రకటించారు.
కాగా శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటుతో ఎన్సీపీ చీలిపోయిన సంగతి తెలిసిందే. జులై 2న 8 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ రాష్ట్రంలోని ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో(Eknath Shinde-BJP government) చేరిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహా వికాష్ అఘాడీలోని మూడు పార్టీల ప్రధాన నాయకులు కలిసి ఓ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అంతకుముందే శివసేన కీలక నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ఏక్‌నాథ్ షిండే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-07-31T10:57:54+05:30 IST