ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special buses: దీపావళికి 16,985 ప్రత్యేక బస్సులు

ABN, First Publish Date - 2023-10-29T11:14:41+05:30

దీపావళి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం 16,895 ప్రత్యేక బస్సులు నడపాలని రవాణా శాఖ నిర్ణయించింది.

పెరంబూర్‌(చెన్నై): దీపావళి పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం 16,895 ప్రత్యేక బస్సులు నడపాలని రవాణా శాఖ నిర్ణయించింది. చెన్నై, కోయంబత్తూర్‌, బెంగళూరు(Chennai, Koimbatore, Bangalore) సహా పలు నగరాల్లో విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారు దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామాలకు వెళ్తుంటారు. సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ ఏడాది పండుగ సందర్భంగా నడపాల్సిన ప్రత్యేక బస్సులపై శనివారం స్థానిక సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శివశంకర్‌(Minister Shivashankar) పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో రవాణా శాఖ కార్యదర్శి ఫణీందర్‌రెడ్డి, అదనపు కార్యదర్శి వెంకటేష్‌, కమిషనర్‌ షణ్ముగసుందరం, పోలీసు, ట్రాఫిక్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

9 నుంచి ప్రత్యేక బస్సులు..

దీపావళి పండుగ ప్రత్యేక బస్సులు నవంబరు 9వ తేది నుంచి నడపనున్నారు. ఆ ప్రకారం, చెన్నై నుంచి 9వ తేది 3,465 బస్సులు, 10వ తేది 3,395, 11వ తేది 3,515 అని మొత్తం 10,975 బస్సులు నడపనున్నారు. అలాగే, ఇతర నగరాల నుంచి 5,920 బస్సులు అని మొత్తం 16,895 బస్సులు నడపాలని నిర్ణయించారు. అదే విధంగా, పండుగ ముగించుకొని నగరాలకు తిరిగిరానున్న వారి కోసం 13వ తేది నుంచి 13,292 బస్సులు నడుపనున్నారు.

ఐదు ప్రాంతాల నుంచి బస్సులు..

చెన్నైలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రించేలా పండుగ రోజుల్లో ప్రత్యేక బస్సులను ఐదు ప్రాంతాల నుంచి నడుపుతున్నారు. ఆ ప్రకారం, ఈ ఏడాది కూడా కోయంబేడు బస్‌ టెర్మినల్‌, పూందమల్లి బస్టాండ్‌, తాంబరం రైల్వేస్టేషన్‌, కేకేనగర్‌, మాధవరం బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.

- మాధవరం బస్టాండ్‌ నుంచి రెడ్‌హిల్స్‌, పొన్నేరి, గుమ్మిడిపూండి, ఊత్తుకోట మార్గంగా ఆంధ్రకు వెళ్లే బస్సులు నడుస్తాయి.

- కేకే నగర్‌ బస్టాండ్‌ నుంచి ఈసీఆర్‌ రోడ్డు మార్గంగా పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం వైపుకు బస్సులు నడపనున్నారు.

- తాంబరం మెప్స్‌ అన్నా బస్టాండ్‌ నుంచి దిండివనం, విక్కిరవాండి, బన్రూటి, కుంభకోణం తదితర ప్రాంతాలకు బస్సులు బయల్దేరనున్నాయి.

- తాంబరం రైల్వేస్టేషన్‌ ప్రాంగణం నుంచి దిండివనం మార్గంగా తిరువణ్ణామలై, పోలూరు, బన్రూటి, నైవేలి, వడలూరు, చిదంబరం, కాట్టుమన్నార్‌కోయిల్‌, పుదుచ్చేరి, కడలూరు వైపుకు బస్సులు నడుపనున్నారు.

- పూందమల్లి బస్టాండ్‌ నుంచి వేలూరు, ఆరణి, ఆర్కాడు, తిరుపత్తూర్‌, కాంచీపురం, సెయ్యారు, హోసూరు, తిరుత్తణి, తిరుపతి వైపునకు బస్సులు బయల్దేరనున్నాయి.

- కోయంబేడు బస్‌ టెర్మినల్‌ నుంచి మైలాడుదురై, నాగపట్టినం, వేలాంకన్ని, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి, సెంగోట్టై, తూత్తుకుడి, తిరుచెందూర్‌, నాగర్‌కోయిల్‌, మార్తాండం, కన్నియాకుమారి, విల్లుపురం, కళ్లకుర్చి, కారైకుడి, పుదుకోట, అరియలూరు, దిండుగల్‌, విరుదునగర్‌, తిరుప్పూర్‌, పొల్లాచ్చి, ఈరోడ్‌, రామనాధపురం, సేలం, కోయంబత్తూర్‌, బెంగుళూరు తదితర ప్రాంతాలకు బస్సులు నడుపనున్నారు.

Updated Date - 2023-10-29T11:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising