Special trains: దీపావళికి ఆరు ప్రత్యేక రైళ్లు
ABN , First Publish Date - 2023-09-30T07:24:53+05:30 IST
దీపావళిని పురస్కరించుకొని చెన్నై నుంచి తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కోయంబత్తూర్(Tirunelveli, Nagercoil, Coimbatore)కు ఆరు ప్రత్యేక
ఐసిఎఫ్(చెన్నై): దీపావళిని పురస్కరించుకొని చెన్నై నుంచి తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కోయంబత్తూర్(Tirunelveli, Nagercoil, Coimbatore)కు ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) తెలిపింది. ఈ ఏడాది దీపావళి నవంబరు 12వ తేది రానుంది. 120 రోజులకు ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకొనే సౌకర్యం ఉండడంతో దక్షిణ జిల్లా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా, తిరునల్వేలి, నాగర్‌కోయిల్, కన్నియాకుమారి, మదురై, సెంగోట్టై, కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 300 దాటింది. దీంతో, చెన్నై నుంచి తిరునల్వేలి, నాగర్‌కోయిల్ మార్గంలో నాలుగు, కోయంబత్తూర్ మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నామని, దీనికి సంబంధించిన ప్రకటన అక్టోబరు చివరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాంబరం - తిరుచ్చి ప్రత్యేక చార్జీ రైలు...
పండుగ రద్దీ దృష్టిలో ఉంచుకొని తాంబరం - తిరుచ్చి మధ్య ప్రత్యేక చార్జీ రైలు నడుపనున్నారు. తాంబరం నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు ఆదివారం ఉదయం 6.10 గంటలకు తిరుచ్చి చేరుకుంటుంది. తిరుచ్చి నుంచి అక్టోబరు 1వ తేది రాత్రి 10.45 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు మరుసటిరోజు ఉదయం 6.10 గంటలకు తాంబరం వచ్చి చేరుతుంది. ఈ రైళ్లు చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు పోర్ట్, చిదంబరం, కుంభకోణం మీదుగా నడుస్తాయి.