Share News

Rajasthan CM race: రాజస్థాన్ సీఎం పోటీలో మహంత్ బాలక్‌నాథ్

ABN , First Publish Date - 2023-12-03T14:47:07+05:30 IST

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్క్‌ను దాటినట్లు ట్రెండ్స్ వెలువడటంతో ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా ఆధ్యాత్మిక నేత, ఆల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పేరు కూడా వినిపిస్తోంది.

Rajasthan CM race: రాజస్థాన్ సీఎం పోటీలో మహంత్ బాలక్‌నాథ్

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) మెజారిటీ మార్క్‌ను దాటినట్లు ట్రెండ్స్ వెలువడటంతో ముఖ్యమంత్రి ఎవరనే ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉండగా, తాజాగా ఆధ్యాత్మిక నేత, ఆల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ (Mahanat Balaknath) పేరు కూడా వినిపిస్తోంది. తిజోరా నియోజకవర్గం నుంచి బాలక్‌నాథ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.


ఆల్వార్ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీగా ఉన్న బాలక్‌నాథ్ వయస్సు 40 ఏళ్లు. ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఆయన శివాలాయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి, మహిళలపై అకృత్యాలు, నేరాలు పెరగిపోవడంతో ఈసారి ప్రజలు ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నారని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడానికి ముందురోజే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను బీజేపీ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. అయితే మర్యాదపూర్వకంగానే ఆయనను కలుసుకున్నట్టు బాలక్‌నాథ్ తెలిపారు.


సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది: బాలక్‌నాథ్

సీఎం ఎవరనే ప్రశ్నకులు బాలక్‌నాథ్ స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే తాము పనిచేస్తామని, సీఎం ఎవరనేది నిర్ణయం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. ఎంపీగా ప్రజాసేవలో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలోనే బాలక్‌నాథ్ సైతం నాథ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. ఆరేళ్ల వయస్సులోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. తాను సన్యాసి కావాలనే నిర్ణయం కుటుంబ సభ్యులు తీసుకున్నారని, సమాజ సేవ చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

Updated Date - 2023-12-03T14:49:27+05:30 IST