Delhi University : తెలుగు, తమిళం ఎంపిక చేసుకున్న విద్యార్థుల కష్టాలు
ABN, First Publish Date - 2023-02-28T20:06:05+05:30
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA)లో గత సంవత్సరం చేరిన విద్యార్థుల్లో కొందరు తెలుగు లేదా తమిళం నాన్ మేజర్ సబ్జెక్ట్‌గా
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA)లో గత సంవత్సరం చేరిన విద్యార్థుల్లో కొందరు తెలుగు లేదా తమిళం నాన్ మేజర్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు. ఈ సిలబస్ కఠినంగా ఉండటంతోపాటు వీరికి ప్రాథమికాంశాలను సైతం బోధించకపోవడంతో మనసు మార్చుకుని, మళ్లీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - యూజీ (CUET-UG)కి హాజరై, తిరిగి ప్రథమ సంవత్సరంలో చేరాలని భావిస్తున్నారు. తెలుగు లేదా తమిళం సబ్జెక్టులో కొనసాగితే తాము ఉత్తీర్ణులయ్యే అవకాశం లేదనే భయమే దీనికి కారణం.
శ్రీ వేంకటేశ్వర కళాశాలలో బీఏ పొలిటికల్ సైన్స్ + తెలుగు, బీఏ పొలిటికల్ సైన్స్ + తమిళం చదువుతున్న విద్యార్థులు తమ సబ్జెక్టులను హిందీకి లేదా సంస్కృతానికి మార్చాలని విశ్వవిద్యాలయాన్ని అనేకసార్లు కోరారు. కానీ ప్రతిసారీ విశ్వవిద్యాలయం ఈ వినతులను తిరస్కరిస్తోంది. ఒకసారి ఎంపిక చేసుకున్న కాంబినేషన్‌ను మార్చడం సాధ్యం కాదని చెప్తోంది. విద్యార్థులు ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలని చెప్తోంది.
నూతన విద్యా విధానం ప్రకారం విద్యార్థులు వేర్వేరు భాషలను ఎంపిక చేసుకుని, చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇవి కంపల్సరీ సబ్జెక్టులు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్ ఒకరు మాట్లాడుతూ, ఈ సమస్య కేవలం తెలుగు, తమిళం భాషలకు మాత్రమే పరిమితం కాదన్నారు. బెంగాలీ, ఒడియా, సింధీ వంటి ప్రాంతీయ భాషలను ఎంచుకున్నవారికి కూడా ఇబ్బందిగానే ఉంటోందన్నారు. భాష తెలియనివారికి సాహిత్యాన్ని బోధించాలనుకోవడమే ఇక్కడ ప్రధాన సమస్య అని, దీనికి విశ్వవిద్యాలయానిదే బాధ్యత అని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Assam : పెద్ద ఎత్తున మతం మారిన గిరిజనులు
Iran : ఇరాన్‌లో ప్రబలుతున్న పైశాచికత్వం... బడికెళ్లే బాలికలపై అత్యంత దారుణం...
Updated Date - 2023-02-28T20:06:05+05:30 IST