ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ అపీలు తిరస్కరణ

ABN, First Publish Date - 2023-04-20T11:37:58+05:30

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు.

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూరత్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి గుజరాత్‌లోని సూరత్ కోర్టులో చుక్కెదురైంది. 2019లో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరు గలవారిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో క్రింది కోర్టు ఆయనను దోషిగా తీర్పు చెప్పడంపై ఆయన చేసిన అపీలును సూరత్ సెషన్స్ కోర్టు (Surat sessions court) గురువారం తిరస్కరించింది. క్రింది కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని, సస్పెండ్ చేయాలని ఆయన చేసిన వినతిని సెషన్స్ కోర్టు అంగీకరించలేదు. ఆయన అపీలుపై ఇరు పక్షాల వాదనలను ఏప్రిల్ 13న కోర్టు స్వీకరించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు గురువారం వెలువడింది.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇది కక్షపూరిత చర్య అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీ అపీలును అనుమతించినట్లయితే, ఆయనకు విధించిన శిక్ష, దోషిత్వ తీర్పును సస్పెండ్ చేసి ఉంటే, ఆయన లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగి ఉండేది.

ఇవి కూడా చదవండి :

Marathon: మాంచెస్టర్ మారథాన్‌లో సత్తాచాటిన భారతీయ మహిళ

Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..

Updated Date - 2023-04-20T12:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising