MK Stalin: ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ... లేఖలో ఏముందో తెలుసా?

ABN , First Publish Date - 2023-03-07T23:02:31+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (TN CM Stalin) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi)కి లేఖ రాశారు.

MK Stalin: ప్రధాని మోదీకి స్టాలిన్ లేఖ... లేఖలో ఏముందో తెలుసా?
Tamil Nadu CM Stalin writes to Prime Minister Modi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (TN CM Stalin) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi)కి లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor policy scam case)లో అరెస్టై తీహార్‌ జైలు(Tihar jail)లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister of Delhi) మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను వెంటనే బేషరతుగా విడుదల చేసేలా ఆదేశించాలని స్టాలిన్ మోదీని కోరారు. భారత్‌లో వేర్వేరు సిద్ధాంతాల రాజకీయ పార్టీలున్నాయని, ఇదే భారత ప్రజాస్వామ్య ప్రత్యేకత అని స్టాలిన్ లేఖలో రాశారు. సిసోడియా అరెస్ట్ తనను అసంతృప్తికి గురిచేసిందన్నారు.

9 విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాసిన రోజుల వ్యవధిలోనే స్టాలిన్ కూడా లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ రెండ్రోజుల క్రితం ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. మనీశ్ సిసోడియా అరెస్టును ఖండించారు.

Updated Date - 2023-03-07T23:02:35+05:30 IST