ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tamil Nadu: తమిళనాట ఇకపై ఆన్‌లైన్‌ జూదం నిషేధం

ABN, First Publish Date - 2023-04-10T22:54:57+05:30

ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించిన గంటల వ్యవధిలోనే బిల్లు ఆమొదం పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Online Gaming Bill
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చెన్నై: తమిళనాట (Tamil Nadu) ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(RN Ravi) ఎట్టకేలకు ఆమోదముద్ర వేశారు. గత అక్టోబరులోనే ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించగా, గవర్నర్‌ పలు సవరణలు సూచించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన సందేహాలు తీర్చినా, గత జనవరిలో ఆ బిల్లును వెనక్కి తిప్పి పంపారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ జూదం నిషేధ బిల్లును గత మార్చి 23వ తేదీన మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అయినా గవర్నర్‌ దానిని పెండింగ్‌లో పెట్టారు. దీనికి తోడు ‘గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారంటే ఆ బిల్లుకు ఆమోదం లేనట్లే’నంటూ బహిరంగ వేదికపై వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి కాల వ్యవధి విధించాలని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చట్టసభలో రూపొందించిన బిల్లును ఆమోదించేలా గవర్నర్‌కు సూచించాలని కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ స్టాలిన్‌ ప్రభుత్వం శాసనసభలో సోమవారం తీర్మానం చేసింది. ఇది జరిగిన 4 గంటల్లోనే గవర్నర్‌ ఆన్‌లైన్‌ జూదం నిషేధ బిల్లును ఆమోదించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇప్పటి వరకు ఆయన వద్ద 14 బిల్లులు పెండింగ్‌లో వుండగా, అందులో ఒకదానికి ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లయింది. ఇదిలా వుండగా గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభ తీర్మానం చేయడం ఇది రెండోసారి. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి గవర్నర్‌గా వుండగా, ఆయన వైఖరిని తూర్పారబడుతూ నాటి ముఖ్యమంత్రి జయలలిత తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మళ్లీ గవర్నర్‌ వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ తమిళ శాసనసభ తీర్మానం చేసింది. ప్రధాని మోదీ (PM Modi) తమిళనాడులో పర్యటించిన గంటల వ్యవధిలోనే బిల్లు ఆమొదం పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2023-04-10T22:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising