Covid-19: కోవిడ్ బారిన వసుంధరా రాజే

ABN , First Publish Date - 2023-04-04T17:50:02+05:30 IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే..

Covid-19: కోవిడ్ బారిన వసుంధరా రాజే

జైపూర్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ (Rajasthan) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే (Vasundhara Raje) మంగళవారంనాడు కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వసుంధరా రాజే ట్వీట్ చేశారు. వైద్యుల సూచనల మేరకు తాను పూర్తిగా ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల కాలంలో తనకు కలిసిన వారు ముందస్తు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

గెహ్లాట్ సైతం..

దీనికి ముందు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం తాను కోవిడ్ పాజిటివ్ బారిన పడినట్టు ట్వీచ్ చేశారు. ప్రభుత్వం హోం ఐసొలేషన్‌లో ఉన్నానని, కొద్దిరోజులు ఇంటి నుంచే తాను విధులను నిర్వహిస్తానని చెప్పారు. పరువునష్టం కేసులో దిగువ కోర్టు తీర్పుపై సూరత్ కోర్టులో సోమవారంనాడు పిటిషన్ వేసిన రాహుల్ గాంధీ వెంట ఉన్న వారిలో గెహ్లాట్ సైతం ఉన్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా మంగళవారంనాడు కొత్తగా 3,308 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద ఉంది. గత 24 గంటల్లో తొమ్మిది మంది కోవిడ్‌తో మృతిచెందారు.

Updated Date - 2023-04-04T17:50:02+05:30 IST