Assam:అడవి ఏనుగు బీభత్సం.. ఫారెస్ట్ ఆఫీసర్‌ని తొక్కి చంపి విధ్వంసం
ABN, First Publish Date - 2023-09-30T13:37:14+05:30
అస్సాం(Assam)లోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్(Forest Officer) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జోర్హాట్‌లోని టిటాబోర్‌లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.
అస్సాం: అస్సాం(Assam)లోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్(Forest Officer) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జోర్హాట్‌లోని టిటాబోర్‌లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.అదే టైంలో ఒక పెద్ద ఏనుగు అకస్మాత్తుగా అధికారులపై దాడి చేసింది. "అది మమ్మల్ని వెంబడించి, ప్రమాదవశాత్తు నేలపై పడిపోయిన అటవీ ఉద్యోగిని తన తొండంతో పట్టుకోగలిగింది" అని గాయపడిన అధికారి తెలిపారు. మరణించిన అటవీ ఉద్యోగిని మరియాని ఫారెస్ట్ రేంజ్‌లో ఫీల్డ్ డ్యూటీ అధికారి అతుల్ కలితాగా గుర్తించారు. అతని మృతదేహాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన డిపార్ట్‌మెంట్ అధికారులను రాజీవ్ బుర్హాగోహైన్, పరాగ్జ్యోతి దత్తా, గిరెన్ మహట్టో, మరొక వ్యక్తిగా గుర్తించారు. జోర్హాట్ అటవీ శాఖ సీనియర్ అధికారి సందీప్ కుమార్ మాట్లాడుతూ, సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో ఏనుగు(Elephants)లు దట్టమైన అడవుల్లో ఆహారం కోసం వెతుకుతుంటాయన్నారు. "అదే ఏనుగు గతేడాది స్థానికుడిని చంపేసింది. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ని తొక్కి చంపింది. సమస్యకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాం”అని కుమార్ చెప్పారు. ఏనుగుల దాడులను అటవీశాఖ అరికట్టలేకపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏనుగులను తరిమికొట్టేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందికి సరిపడా ఆయుధాలు, పరికరాలు లేకపోవడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుందని వారు అన్నారు. అలాంటి సమయాల్లో వారి వద్దే తుపాకులు వేరే ఆయుధాలు లేకపోతే తాము ఎలా జీవించాలని ప్రశ్నించారు. అయితే ఏనుగుల గుంపును తరిమికొట్టేందుకు వెళ్లిన బృందం వద్ద తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్నాయని కుమార్ తెలిపారు. ఏనుగును తుపాకితో కాల్చినప్పటికీ ఓ అధికారి దానికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడని వివరించారు.
Updated Date - 2023-09-30T13:37:34+05:30 IST