ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Womens: 60 ఏళ్లు పైబడిన మహిళలకు సర్కార్ శుభవార్త

ABN, First Publish Date - 2023-02-09T12:52:52+05:30

ఉత్తరప్రదేశ్‌లోని 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త...

FREE BUS TRAVEL
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరవై ఏళ్ల పైబడిన మహిళలకు శుభవార్త. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త వెల్లడించారు.(Womens)60 ఏళ్లు పైబడిన మహిళలకు యూపీ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్‌ఆర్‌టీసీ)(UP State Road Transport Corporation) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం(Free Bus Travel) కల్పించాలని సీఎం యోగి తాజాగా ఆదేశించారు. 2022 ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఉచిత ప్రయాణ హామీ(Election Manifesto) ఇచ్చింది. ఈ నెలాఖరులో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Bill Gates Dating: పౌలాహర్డ్‌తో బిల్ గేట్స్ ప్రేమాయణం...డేటింగ్

వృద్ధ మహిళలను బస్సుల్లో ఎక్కించడం వల్ల యూపీఎస్‌ఆర్‌టీసీకి వచ్చే ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉందని యూపీ అధికారులు తెలిపారు.వృద్ధ మహిళల నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని కోరితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌కు రూ.800 కోట్లకు పైగా పరిహారం అవసరమవుతుందని సూచిస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించామని యూపీఎస్ ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.

ఇది కూడా చదవండి : Vande Bharat Express: షిర్డీ సాయి భక్తులకు శుభవార్త

ప్రతిరోజు సగటున 3,73,800 మంది మహిళా ప్రయాణికులు తమ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, వారిలో 88,438 మంది 60 ఏళ్లు పైబడిన వారేనని ఆర్టీసీ అంచనా వేసింది.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలలోపు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు మిగిలిన అన్ని ముందస్తు ఎన్నికల హామీలను నెరవేర్చాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది.

Updated Date - 2023-02-09T12:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising