heart attack: గుండె బలంగా ఉండాలంటే ఇలా చేయడమే.. లేదంటే మీ ఆరోగ్యం డౌటే..!
ABN , First Publish Date - 2023-03-13T14:25:11+05:30 IST
ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
మన గుండె కొట్టుకునే తీరులో అసాధారణ మార్పు కారణంగా ఆకస్మిక గుండె మరణం లేదా ఆకస్మికంగా గుండె ఆగిపోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో మన గుండె ఆరోగ్యం క్షీణించటానికి చాలా కారణాలు ఉన్నాయి. యువకులు, వృద్ధులలో గుండెపోటు కేసులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. వ్యాయామం లేని నిశ్చల జీవనశైలి, ప్రాసెస్ చేయబడిన ఆహారం, చక్కెర అధికంగా ఉన్న అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి వంటివి గుండె అనే చాలా కీలకమైన అవయవాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఇటీవలి ప్రముఖుల మరణాలు వరుస గుండెపోట్లు ప్రజలను ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. గుండె పనిచేసే తీరులో వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ చాలా వేగంగా ఉంటుంది. పూర్తి హార్ట్ బ్లాక్ లాగా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో, గుండె పని చేయలేకపోవటంతో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది. గుండెపోటులో ఒక గుండె ధమని అకస్మాత్తుగా మూసుకుపోయినప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
హృదయానికి చిట్కాలు..
1. ఆరోగ్యకరమైన బరువు
అధిక బరువు లేదా ఊబకాయం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువును లక్ష్యంగా చేసుకోవాలి. గుండె ఆరోగ్యంలో ఈ ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో హెవీ వెయిట్ వ్యక్తికి మామూలు వ్యక్తికి గుండె ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. ఎత్తు, వయస్సు, ఆరోగ్య పరిస్థితి మొదలైన వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది.
2. ఆరోగ్యకరమైన ఆహారం
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేయబడిన, అధిక కొవ్వు పదార్ధాలను తీసుకోవడం తగ్గించడం చాలా ముఖ్యం.
3. క్రమం తప్పకుండా వ్యాయామం
రెగ్యులర్ వ్యాయామం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వారంలో కనీసం 30 నిమిషాల మితమైన తీవ్రతతో వ్యాయామం చేయాలనే లక్ష్యం పెట్టుకోండి.
4. ఒత్తిడి
ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మైండ్‌ఫుల్‌నెస్, యోగా సాధన, తగినంత నిద్ర , థెరపిస్ట్‌తో మాట్లాడటం వంటివి ఒత్తిడిని నిర్వహించడానికి ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం మంచిది.
5. ధూమపానం మానుకోండి
ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం చేస్తే, దానిని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ఉత్తమం.
6. రెగ్యులర్ చెక్అప్‌లు తప్పనిసరి.
ఆరోగ్య సంరక్షణలో భాగంగా రెగ్యులర్ చెక్అప్‌లు తప్పనిసరి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ఏవైనా పరిస్థితులను గుర్తించడంలో ఇవి సహాయపడతాయి.