Health Tips: అన్నం.. చపాతీ.. రెండిటినీ కలిపి తింటే జరిగేదేంటి.? డైట్ పేరుతో ఇలా తినేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!

ABN , First Publish Date - 2023-06-14T10:50:12+05:30 IST

రెండు ధాన్యాలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నందున

Health Tips: అన్నం.. చపాతీ.. రెండిటినీ కలిపి తింటే జరిగేదేంటి.? డైట్ పేరుతో ఇలా తినేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!
meticulous eating

ఆకలి వేయగానే ఆరోజుకి కావాల్సింది తినేస్తూ ఉంటాం. అయితే అసలు ఏం తింటున్నాం అనేదాని మీద కాస్తన్న గమనింపు అవసరం. ఎందుకంటే తినే ప్రతిదీ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు. మామూలుగా చాలామంది భోజనంలో అన్నం, చపాతీ కలిపి తినేస్తూ ఉంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయం ఎంతమందికి తెలుసు.. అసలు వీటిని కలిపి తింటే ఏం జరుగుతుంది. అదే తెలుసుకుందాం.

ఒకే భోజనంలో అన్నం, చపాతీ తినకూడదట. తృణధాన్యాలు శక్తికి అవసరమైన మూలం ఆహారంలో ప్రధానమైనవి కూడా ఇవే. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల వీటిలో పుష్కలంగా ఉంటాయి. హోల్ వీట్ వంటి తృణధాన్యాలు, ఊక, బీజ, ఎండోస్పెర్మ్‌లను కలిగి ఉంటాయి. ఈ ధాన్యాలను ప్రాసెస్ చేసి, శుద్ధి చేసినప్పుడు, అవి వాటి ఎండోస్పెర్మ్‌ను మాత్రమే నిలుపుకుంటాయి.

భోజనంలో గోధుమలు, బియ్యం కలిపి తీసుకోవడం వల్ల కూరగాయలు, సలాడ్ నుండి రిచ్ ఫైబర్‌తో తృణధాన్యాలను కలగలిపి ఉంటాయి. అయితే వాటిలో ముఖ్యంగా, గోధుమ, బియ్యం రెండూ దాదాపు ఒకే విధమైన ప్రొఫైల్‌ను కలిగి ఉంటాయి, అయితే వాటి ఫైబర్ కంటెంట్ పరంగా మీగతా వాటితో పోల్చితే ఈ రెండిటితో మిగతావాటికి గణనీయమైన వ్యత్యాసం ఉంది. గోధుమలు ఫైబర్‌ను కలిగి ఉంటాయి, ఇది శరీరంలో చక్కెర విడుదలకు సహాయపడుతుంది, అయితే బియ్యం, సాధారణ పిండి పదార్థాలను కలిగి ఉంటుంది, శరీరంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.

ఇది కూడా చదవండి: బ్రష్ చేయకుండా తింటే ఏమవుతుంది..? ఒక్కరోజే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిస్తే..!

బియ్యం, గోధుమలను కలిపి తినకుండా కనీసం రెండు గంటల సమయం గ్యాప్ ఇవ్వాలి.

ఇలా గ్యాప్ లేకుండా తినడం వల్ల ప్రేగులలో పులియబెట్టబడి, చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రెండు ధాన్యాలలో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నందున, వాటిని కలిసి ఉండటం వలన అజీర్ణంతోపాటు కడుపు ఉబ్బరం కూడా వస్తుంది. కొన్ని సమయాల్లో ఇదే వికారం వాతులకు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకునేముందు కాస్త సమయాన్ని పాటించి తీసుకోవడం చాలా ముఖ్యం.

Updated Date - 2023-06-14T10:50:12+05:30 IST