Tea vs Skin: ఎక్కువగా టీ తాగితే చర్మం రంగు నల్లగా మారిపోతుందా..? చిన్న పిల్లల్ని టీ తాగొద్దని ఎందుకు అంటారంటే..!
ABN, First Publish Date - 2023-08-01T13:25:01+05:30
చర్మం రంగు జన్యుశాస్త్రం, జీవనశైలి చర్మంలో ఉండే మెలనిన్‌పై ఆధారపడి ఉంటుంది.
ఉదయాన్నే టీ తాగనిదే మనలో చాలామందికి ఆరోజు ప్రారంభం అయినట్టు కాదు. చాలా విషయాల్లో రాజీపడినా టీ విషయానికి వచ్చే సరికి రాజీపడలేం. కానీ ఈ అలవాటు పెద్దల్లో ఉండటం సర్వ సాధారణం అయినా, పిల్లలకు మాత్రం టీ ఇవ్వడానికి ఇష్టపడం. కానీ పిల్లలు టీ తాగాలని తెగ ఉబలాటపడుతూ ఉంటారు. ఇది మంచి అలవాటు కాదని చెబుతాం కానీ మనకూ సరైన కారణం తెలీదు. అసలు టీని పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు. టీని ఎక్కువగా తాగితే చర్మం రంగు నలుపుగా మారుతుందా? ఇది ఎంతవరకూ నిజం..
చిన్నతనంలో, ప్రతి ఒక్కరూ తమ తల్లితండ్రులు లేదా తాతయ్యలు చెప్పడం విని ఉంటారు, ఎక్కువ టీ తాగవద్దు, లేకపోతే నల్లగా మారతారని.. అయితే, ఇలా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, పిల్లలు టీ తాగకూడదు, ఎందుకంటే అందులో కెఫిన్ అధికంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి హానికరం. కానీ కొంతమంది పిల్లలు పెద్దయ్యాక కూడా అది నిజమని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: రేటు ఎక్కువ అని ఆలోచించకండి.. టొమాటోలకు వీటిని కలిపి ముఖానికి ఒక్కసారయినా రాసుకుంటే..!
టీకి సంబంధించి..
1. టీకి ముఖ ఛాయతో సంబంధం లేదు. ఇది కేవలం పుకారు మాత్రమే. అందుకే దానిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు.
2. టీతో చర్మం రంగు నల్లగా మారుతుందనే శాస్త్రీయమైన పరిశీలన ఇప్పటి వరకూ కనుగొనలేదు. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, చర్మం రంగు జన్యుశాస్త్రం, జీవనశైలి చర్మంలో ఉండే మెలనిన్‌పై ఆధారపడి ఉంటుంది.
3. పిల్లలు టీ తాగడం తాగకూడదు. ఎందుకంటే ఇందులో వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే కెఫిన్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇక నుంచి టీ తాగినా, తాగకపోయినా ముఖ ఛాయపై ప్రభావం చూపదని మాత్రం తెలుసుకోండి.
Updated Date - 2023-08-01T13:25:58+05:30 IST