Old Age: ఈ ముసలోళ్లు నిద్రే పోరా..? అని తిట్టుకుంటూ ఉంటారు కానీ.. వయసు పెరుగుతోంటే తొందరగా మెలకువ ఎందుకొస్తుందంటే..!

ABN , First Publish Date - 2023-06-14T11:41:17+05:30 IST

అస్పష్టమైన దృష్టి, దృష్టిలో సమస్య వంటి సమస్యల ఎక్కువగా ఉండవచ్చు.

Old Age: ఈ ముసలోళ్లు నిద్రే పోరా..? అని తిట్టుకుంటూ ఉంటారు కానీ.. వయసు పెరుగుతోంటే తొందరగా మెలకువ ఎందుకొస్తుందంటే..!
sleep patterns

మాములుగా ఇప్పటి ఒత్తిడి జీవన శైలితో నడివయసు వారిలోనే నిద్రలేమిని ఎక్కువగా చూస్తూ ఉన్నాం అలాంటిది. కాస్త వయసు పైబడిన వాళ్ళు రాత్రి పూట అగస్మాత్తుగా నిద్ర నుంచి లేచి కూర్చోవడం, నిద్ర పట్టక తిరగడం చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది. ఇదేమైనా అనారోగ్య సూచన కాదుకదా.. ఇలా వయసు పెరిగిన వారిలో మాత్రమే ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.

సూర్యోదయానికి ముందే మేల్కొంటారు.

కుటుంబంలో వృద్ధులు ఉన్నట్లయితే, ఉదయాన్నే లేచి కూర్చున్నారు అనుకోకుండా వాళ్ళకు నిద్రలేమి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోండి. ఇది నిద్ర లేమి సమస్య కావచ్చు కాకపోవచ్చు. సాధారణంగా, చాలా మంది వృద్ధులు అర్థరాత్రి మేల్కొవడం మళ్లీ నిద్రపోవడం, మూత్రవిసర్జన చేయడం వంటివి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా నొప్పి కారణంగా ఈ నిద్ర కష్టాలు వస్తూ ఉంటాయి.

మెదడు బలహీనపడితే..

నిద్ర లేమి వెనుక ఒక కారణం ఏమిటంటే, మన మెదడు వయస్సు పెరిగే కొద్దీ స్పందించడం తగ్గుతుంది. వృద్ధాప్యం కారణంగా సూర్యాస్తమయం, సూర్యకాంతి మొదలైన ఇంద్రియాలకు మన మెదడు ప్రతిస్పందనలు మునుపటిలా ఉండవు. ఇది మన సమయ స్పృహను, సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

ఇది కూడా చదవండి: అన్నం.. చపాతీ.. రెండిటినీ కలిపి తింటే జరిగేదేంటి.? డైట్ పేరుతో ఇలా తినేవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివి..!

సమయాన్ని గ్రహించలేకపోవడం..

వృద్ధులు సమయాన్ని సరిగ్గా గ్రహించలేరు, త్వరగా అలసిపోతారు. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా కూడా ఉదయాలు ముందుగానే మేల్కొంటారు.

బలహీనమైన కంటి చూపు

వయస్సుతో వచ్చే దృష్టి మార్పులు కారణంగా మెదడు కాంతిని గ్రహించే శక్తి తగ్గతుంది. దీనికి తోడు కంటిశుక్లం ఉన్న పెద్ద వయసు వారు ముఖ్యంగా ఈ సమస్యను అనుభవిస్తారు, అస్పష్టమైన దృష్టి, దృష్టిలో సమస్య వంటి సమస్యల ఎక్కువగా ఉండవచ్చు.

ఈ చిట్కా సహాయపడవచ్చు.

సూర్యాస్తమయానికి ముందు ఆరుబయట నడవడం, పుస్తకాన్ని చదవడం, టీవీ చూడటం, తోటపని ఇలాంటివి మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. అలాగే రాత్రి పూట ప్రకాశవంతమైన లైట్లు మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతాయి. అలసిపోయినట్టు అనిపించగానే నిద్ర పోవడం వల్ల అది మీ నిద్ర చక్రాన్ని సరిచేయవచ్చు.

Updated Date - 2023-06-14T11:41:17+05:30 IST