Kids health: చిన్నపిల్లల కోపాన్ని చల్లార్చే 8 మార్గాలివీ.. ఇలా చేయండి చాలు
ABN, First Publish Date - 2023-04-01T15:57:14+05:30
పదే పదే కొట్టడం, దండించడం, పనిష్మెంట్లు వంటివి ఇవ్వడం ఇది పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది.
పిల్లలు తమను అర్థం చేసుకోలేకపోతున్నారని తల్లిదండ్రులు భావించే సందర్భాలు చాలా ఉంటాయి. కాస్త ఎదుగుతున్నారంటే.. వారి ప్రవర్తనలో వచ్చే మార్పులు అన్నీ ఇన్నీ కావు. తల్లిదండ్రులతో దూరంగా, దురుసుగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. ఇది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, ఎదిగే వయసులో పిల్లల దూకుడు ప్రవర్తన తల్లిదండ్రులకు సవాలుగా ఉంటుంది. పిల్లల భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించడంలో సహాయపడటానికి పరిస్థితిని ప్రశాంతంగా ఓపికగా ఉంచడం చాలా ముఖ్యం. కాబట్టి, పిల్లలను సరైన దారిలో ఉంచాలంటే..
ప్రశాంతంగా కూర్చోండి.
పిల్లలు అల్లరికి, వస్తువులను పాడు చేసినా, తల్లిదండ్రులు కోపంగా స్పందిస్తారు, అది పిల్లల్ని భయపెడుతుంది. క్షణంలో భావోద్వేగానికి గురి కావడం. విసుగు, కోపంగా ప్రతిస్పందించడం చేస్తే పిల్లలు మరింత దూరంగా వెళిపోయే అవకాశం ఉంది. అందుకే ప్రశాంతంగా ఉండటం, బిడ్డను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అరవడం లేదా కోపం తెచ్చుకోవడం పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. పిల్లల ప్రవర్తనను తగ్గించడం మరింత కష్టతరం కావచ్చు.
భావాలను అర్థం చేసుకోండి.
దూకుడుగా ఉండే పిల్లలకి సహాయపడే మార్గాలలో ఒకటి పిల్లల ఆలోచనలను, మాటలను వినడం అలవాటు చేసుకోండి. పిల్లవాడు విన్నట్లు, అర్థం చేసుకున్నట్లు అనిపించగానే వాళ్ళ దిగులుకు కారణాలను కనుక్కోండి. కోపంగా ఉన్న సందర్భాన్ని కనుక్కోండి. ఇలా చేస్తే పిల్లల భావోద్వేగాలను శాంతింపజేసేందుకు, నియంత్రించే అవకాశం ఉంటుంది. ఏం తప్పు చేసానని వారిని అడగండి. పిల్లల మాటల్ని శ్రద్ధగా వినండి. వారు చెప్పేది విని మళ్లీ మళ్లీ అడగండి.కారణాలు తెలుసుకోండి. ఆ సమయానికి మీరూ చిన్నపిల్లలైపోయి సారీ చెప్పేసినా తప్పులేదు. ఇదే కోపం, అసహనం మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి.
సౌకర్యాన్ని అందించండి.
పిల్లవాడు కలతగా ఉన్నప్పుడు, మానసికంగా సపోర్ట్ అవసరం. చిన్నగా దగ్గరకు తీసుకుని కౌగిలింత లేదా సున్నితమైన స్పర్శను ఇవ్వండి.
ఇది కూడా చదవండి: హార్ట్ ఆపరేషన్ తర్వాత ఏ ఫుడ్ తింటే.. ఏమౌతుందో అనే ఆందోళనలో ఉన్నారా.. డోంట్ వర్రీ..
కూల్‌గా ఉండనీయండి.
వీలైతే, కోపంగా ఉన్నప్పుడు పిల్లలకి ప్రశాంతమైన స్థలాన్ని వదిలేయండి. అది పిల్లల బెడ్‌రూమ్, ప్లే రూమ్, లివింగ్ రూమ్‌లో ఏ ప్రాంతం అయినా కావచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలతో, పెద్ద శబ్దాలు వంటి అంతరాయం లేకుండా ఖాళీ స్థలం ఉండేలా చూడండి. పిల్లల ఆలోచనలు, భావోద్వేగాలకు కొంత సమయం ఒంటరిగా గడపడం చాలా మంచిది.
డిస్ట్రక్షన్‌ని ఆఫర్ చేయండి
కొన్నిసార్లు, పిల్లల ఆలోచనలు తీవ్రంగా ఉంటే వారి దృష్టిని మళ్లించడానికి ఇష్టమైన బొమ్మ, పుస్తకం ఇవ్వండి. ఇది వారి దృష్టిని మరింత సానుకూలంగా మార్చడానికి సహాయపడుతుంది.
నిద్రపోనీయండి.
భావోద్వేగాలను నియంత్రించడానికి, కాస్త ప్రశాంతంగా ఉంచడానికి పిల్లవాడిని నిద్రపోయేలా చేయండి. కాసేపు పడుకుంటే కాస్త కూల్ గా ఉంటారు.
కాస్త కూల్ కావాల్సిందే..
పిల్లల ప్రవర్తనకు విసిగిపోయి వారిని పదే పదే కొట్టడం, దండించడం, పనిష్మెంట్లు వంటివి ఇవ్వడం ఇది పరిస్థితిని తీవ్రతరం చేస్తుంది. పిల్లల మానసిక శ్రేయస్సుకు హాని కలిగిస్తుంది. కనుక పిల్లల్ని కొట్టకుండా శాంతంగా వారికి నచ్చజెప్పే విధంగా తల్లిదండ్రులు ఆలోచించాలి.
వైద్యులను సంప్రదించండి.
శారీరక హింసకు పాల్పడుతుంటే మాత్రం ఆరోగ్య నిపుణులను సంప్రదించండి. పిల్లల దూకుడును ప్రభావవంతంగా ఎదుర్కోవడానికి వైద్యుల సహాయం తప్పనిసరి.
Updated Date - 2023-04-01T20:55:03+05:30 IST