Hero Krishna : కృష్ణ అరుదైన రికార్డ్
ABN, First Publish Date - 2023-01-21T23:25:09+05:30
తమిళ రాజకీయ రంగంలో ‘మక్కళ్ తిలగం’ ఎం జి ఆర్, ఎం.కరుణానిధి తిరుగులేని నాయకులు. సినీ రంగంలోనూ తమ ప్రతిభ చాటిన ప్రముఖులు వీరిద్దరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు ఎంజీఆర్ కి, ఇటు కరుణానిధికి సంబంధించిన వ్యక్తులు హీరో కృష్ణ తో తెలుగులో సినిమాలు తీయడం.
తమిళ రాజకీయ రంగంలో ‘మక్కళ్ తిలగం’ ఎం జి ఆర్, ఎం.కరుణానిధి తిరుగులేని నాయకులు. సినీ రంగంలోనూ తమ ప్రతిభ చాటిన ప్రముఖులు వీరిద్దరు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అటు ఎంజీఆర్ కి, ఇటు కరుణానిధికి సంబంధించిన వ్యక్తులు హీరో కృష్ణ తో తెలుగులో సినిమాలు తీయడం. ఇద్దరు తమిళనాడు ముఖ్యమంత్రులు తెలుగులో నిర్మించిన చిత్రాల్లో నటించడం హీరో కృష్ణ కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. ఎంజీఆర్ సన్నిహితుడుగా పేరొందిన పి.పద్మనాభన్ ‘మక్కల్ తిలగం మూవీస్’ పతాకంపై కృష్ణతో ఒకటి కాదు రెండు సినిమాలు తీశారు. అందులో మొదటిది ‘షంషేర్ శంకర్’ . శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కె.ఎ్‌స.ఆర్.దాస్ దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించే చిత్రాల్లో సాధారణంగా ఏ ఏ అంశాలు ఉంటాయో అవన్నీ ‘షంషేర్ శంకర్‌ః లో ఉన్నాయి. ఈ చిత్రానికి కథకుడు కూడా కె.ఎ్‌స.ఆర్.దాసే. పగ ప్రతీకారం అంశాలతో మాస్ ఆడియన్స్‌ను అలరించే విధంగా ‘షంషేర్ శంకర్’ చిత్రాన్ని తీర్చిదిద్దారు దాస్ టైటిల్ రోల్‌ని హీరో కృష్ణ అలవోకగా పోషించారు. పాత్రలో పెద్దగా పస లేకపోయినా పాత్రధారి కృష్ణ కావడంతో తన అభినయంతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన ధరించిన మారు వేషాలు అభిమానుల్ని అలరించాయి. ముఖ్యంగా మాయదారి మల్లిగాడు గెటప్ లో కృష్ణ మరోసారి కనిపించడం విశేషం.
ఇక పూల పిల్ల గౌరీ గా శ్రీదేవి నటన సహజంగా, అభినందనీయంగా ఉంది.రెండో సినిమాఅంతకుముందు కొన్ని కన్నడ, తమిళ చిత్రాలకు దర్శకునిగా, ఛాయగ్రాహకునిగా పనిచేసిన అమృతము దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం. ‘అమ్మాయికి మొగుడు-మామకు అల్లుడు’. పుంపుహార్ ప్రొడక్షన్స్ బేనరుపై రూపుదిద్దుకొన్న ఈ చిత్రానికి మహారధి సంభాషణలు రాశారు. జమిందారీ కుటుంబ నేపథ్యంలో జరిగే కథ కావడంతో మైసూరులోని లలిత మహల్ ప్యాలెస్ లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. పాటలు సహా టాకీ పార్ట్ ను బెంగళూరు లోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో రజనీ శర్మ కథానాయికగా నటించారు. ఆమె నేపాలి యువతి. తమిళ, హిందీ, మలయాళ, నేపాలి చిత్రాల్లో నటించిన అనుభవం ఆమెకు ఉంది. అంతకు ముందు తెలుగులో లో గయ్యాళి గంగమ్మ చిత్రంలో నటించారు. శంకరాభరణం రాజ్యలక్ష్మి ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించారు.టీజింగ్ క్యారెక్టర్స్ చేయడం హీరో కృష్ణ కు బాగా అలవాటు కనుక చాలా హుషారుగా నటించారు. పాత్రలో జీవించారు. అలాగే మామ పాత్రను సత్యనారాయణ కూడా తనదైన శైలిలో పోషించారు.
Updated Date - 2023-01-21T23:25:13+05:30 IST