Height Increasing: తల్లిదండ్రులకు ఇంపార్టెంట్ అలెర్ట్.. పిల్లల ఎత్తు గురించి కంగారొద్దు.. ఇంట్లోనే చేసే ఈ డ్రింక్‌ను రోజూ తాగిస్తే..!
ABN , First Publish Date - 2023-06-27T15:55:30+05:30 IST
దీనిలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.
పిల్లలు కాస్త ఎత్తు తక్కువున్నారంటే చాలు తల్లిదండ్రులు తెగ బాధపడిపోతారు. చాలామంది ఇది జన్యులోపంగా కూడా చూస్తారు. నిజానికి పిల్లలు ఎదిగే వయసులో వారికి అందించాల్సిన పోషకాలను సరిగా అందియ్యాలి. ఇందులో ఏ కాస్త లోపం జరిగినా పిల్లల బరువు, ఎత్తులో తేడా వస్తుంది. నిజానికి పిల్లల ఎత్తు ఎక్కువగా వారి తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల పిల్లల ఎత్తు పెరగడం ఆగిపోతుంది. దానికి పిల్లలకు బలాన్నిచ్చే పోషకాలను కలిగిన డ్రింక్స్ ని అందివ్వాలి.
ఎత్తు పెరగడానికి సూపర్ డ్రింక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
1 కప్పు పాలు
ఒక పండిన అరటిపండు
1 టేబుల్ స్పూన్ బాదం లేదా వేరుశెనగ వెన్న
తీపి కోసం 1 టేబుల్ స్పూన్ తేనె
1 టీస్పూన్ చియా గింజలు లేదా వేపిన అవిసె గింజలు
ఇది కూడా చదవండి: నిమ్మకాయలు ఎండిపోయాయి కదా అని పారేస్తున్నారేమో.. వాటితో కూడా ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!
ఎత్తు పెంచే పానీయం ఎలా తయారు చేయాలి.
దీని కోసం, పైన పేర్కొన్న అన్ని పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ పానీయాన్ని ఒక గ్లాసులో పోసి పిల్లలకు ఇవ్వండి. దీనిలో క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి నిద్రపోయే 1 గంట ముందు త్రాగవచ్చు.
ఇది కాకుండా, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, శారీరక శ్రమతో పాటు, మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల, పిల్లల ఎత్తు పెరగదని, 20 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఎత్తు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.