Banned Medicines: ఈ 9 మెడిసిన్స్‌తో జాగ్రత్త.. ఆ దేశాలకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా వీటిని తీసుకెళ్లకండి..!
ABN, First Publish Date - 2023-07-07T13:56:55+05:30
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రిస్క్రిప్షన్, ఓవర్-ది-కౌంటర్ (over-the-counter) మందులపై కొన్ని ఆశ్చర్యకరమైన కఠిన చట్టాలు ఉన్నాయి.
Banned Medicines: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రిస్క్రిప్షన్, ఓవర్-ది-కౌంటర్ (over-the-counter) మందులపై కొన్ని ఆశ్చర్యకరమైన కఠిన చట్టాలు ఉన్నాయి. అందుకే అలాంటి మెడిసిన్స్ తీసుకెళ్లేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో చేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని జైలులో పెట్టే వస్తువులను ప్యాక్ చేయకపోవడం మంచిది. ఇక్కడ మనం చెప్పుకోబోయే ఈ 9 మెడిసిన్స్‌తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కొన్ని దేశాలకు వెళ్లేటప్పుడు పొరపాటున కూడా తీసుకెళ్లకండి.
1. సుదాఫెడ్, విక్స్..
మీరు జపాన్‌కు వెళ్తున్న సమయంలో ఒకవేళ మీకు జలుబు ఉంటే.. ఓవర్-ది-కౌంటర్ మందులను ఇంట్లో వదిలివేయండి. సూడోపెడ్రిన్ (Pseudoephedrine) అనే పదార్ధాన్ని కలిగి ఉన్న సుడాఫెడ్, విక్స్ వంటి సాధారణ జలుబు మందులు ఆ దేశంలో నిషేధించబడ్డాయి.
2. కోడైన్, ట్రామాడోల్
కొడైన్, ట్రామడాల్ (సాధారణ బ్రాండ్ పేర్లు: అల్ట్రామ్ మరియు కాన్‌జిప్) వంటి కొన్ని ఒంటినొప్పి మందులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాలలో నిషేధించబడ్డాయి. ఈ నియంత్రిత మందులకు ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఇక గ్రీస్, జపాన్, సౌదీ అరేబియా వంటి దేశాలలో ఈ మందులను తీసుకెళ్లడం అరెస్టుకు దారితీయవచ్చు.
3. బెనాడ్రిల్
మీరు అలర్జీల కోసం బెనాడ్రిల్ (Benadryl) ను ఉపయోగించే అలవాటు ఉందా? అయితే, ఈ మెడిసిన్‌తో మీరు జాంబియాకు ప్రయాణిస్తున్నట్లయితే ప్రత్యామ్నాయాల గురించి మీ వైద్యుడిని సంప్రదించడం బెటర్. ఈ మందు కలిగి ఉండే డిఫెన్‌హైడ్రామైన్ (Diphenhydramine) అనే క్రియాశీల డ్రగ్ అక్కడ నిషేధించబడింది. అయితే, జపాన్‌లో మాత్రం పది మిల్లీగ్రాముల క్యాప్సూల్స్‌కు అవకాశం ఉంది.
4. అడెరాల్, రిటాలిన్
మీరు అటెన్షన్ డెఫిషిట్ డిసార్డర్ (Attention deficit disorder) కోసం మందులపై ఆధారపడుతున్నట్లయితే, మీ బకెట్ జాబితా నుండి జపాన్‌ను వదిలివేయవలసి ఉంటుంది. మీరు మీ ప్రిస్క్రిప్షన్, మీ డాక్టర్ నుండి నోట్‌ను కలిగి ఉన్నప్పటికీ మెథాంఫేటమిన్‌లు (Methamphetamines) యాంఫేటమిన్‌లపై (Amphetamines) ఆ దేశం జీరో-టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉంది. అటు సౌదీ అరేబియాలో కూడా ఈ మెడిసిన్స్‌పై నిషేధం ఉంది.
5. అంబియన్, ఇంటర్‌మెజో
కొత్త దేశానికి సంబంధించిన టైమ్ జోన్‌ను సర్దుబాటు చేసే క్రమంలో జోల్పిడెమ్ కలిగి ఉన్న స్లీపింగ్ టాబ్లెట్ మీ అలవాటు కావొచ్చు. కానీ, మీరు సౌదీ అరేబియా, నైజీరియాకు ప్రయాణిస్తున్నట్లయితే వాటిని ఇంట్లో వదిలివేయడం మంచిది. ఇక మీరు సింగపూర్‌కు వెళ్తున్నారా? అయితే, మీ అంబియన్ (Ambien) మందులను చట్టబద్ధంగా తీసుకురావడానికి మీరు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
Dubai: వైరల్‌గా మారిన బుడ్డోడి ఇంటర్వ్యూ.. అది చూసి బంపరాఫర్ ఇచ్చిన దుబాయ్ యువరాజు!
Updated Date - 2023-07-07T13:57:12+05:30 IST