NRIs: కెనడియన్ ఎన్నారైలకు భారత్‌లో పెట్టుబడుల కోసం.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఇవే..

ABN , First Publish Date - 2023-09-24T08:28:16+05:30 IST

కెనడియన్ ఎన్నారైలు ఇండియాలో అనేక రూపాలలో పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంది. వారికి భారత్‌లో పెట్టుబడుల కోసం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.

NRIs: కెనడియన్ ఎన్నారైలకు భారత్‌లో పెట్టుబడుల కోసం.. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఇవే..

ఎన్నారై డెస్క్: కెనడియన్ ఎన్నారైలు ఇండియాలో అనేక రూపాలలో పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంది. వారికి భారత్‌లో పెట్టుబడుల కోసం బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వారు మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక్కడ పేర్కొన్న ఈ పెట్టుబడి ఆప్షన్లలో ఏది బెస్ట్? ఎందులో ఎలాంటి సౌలభ్యాలు ఉంటాయి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్..

మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లో పెట్టుబడి పెట్టడానికి ఎన్నారైలు మొదట కేవైసీ (KYC) పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్, విదేశీ ఖాతా పన్ను వర్తింపు చట్టం (FATCA) తదితర పూర్తి వివరాలు అందించాలన్నమాట. అందులోనూ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కెనడియన్ ఎన్నారైలకు మంచి పెట్టుబడి ఎంపిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అవి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నష్టాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్..

సురక్షితమైన పెట్టుబడి కోసం చూసే ఎన్నారైలకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (Fixed Deposits) మరో మంచి ఆప్షన్. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ నిర్దిష్ట కాలానికి భారతీయ కరెన్సీలో డబ్బును డిపాజిట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కూడా. మీరు చేసే డిపాజిట్లపై నిర్ణీత వడ్డీని సైతం పొందే అవకాశం ఉంటుంది.

విదేశీ కరెన్సీ డిపాజిట్స్..

విదేశీ మారకపు రేటు నష్టాలను నివారించాలనుకునే ఎన్నారైలకు విదేశీ కరెన్సీ డిపాజిట్స్ (Foreign Currency Deposits) మంచి పెట్టుబడి ఎంపిక. విదేశీ కరెన్సీ డిపాజిట్లు కెనడియన్ డాలర్లు వంటి విదేశీ కరెన్సీలో డబ్బును డిపాజిట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఆ డిపాజిట్‌పై వడ్డీని పొందవచ్చు.

రియల్ ఎస్టేట్..

దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్న ఎన్నారైలకు రియల్ ఎస్టేట్ (Real Estate) చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. అయితే, ఇండియాలో రియల్ ఎస్టేట్ కొనుగోలు ప్రక్రియ అనేది కూసింత సంక్లిష్టంగా ఉంటుందని గమనించాలి. భారత్‌లో పెట్టుబడి పెట్టే ఎన్నారైలు నిర్దిష్ట పన్ను ప్రయోజనాలకు అర్హులు. ఉదాహరణకు భారతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఎన్నారైలు దీర్ఘకాలిక మూలధన లాభాలపై తక్కువ పన్ను రేటు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇక స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్నారైలకు సలహాలు ఇవ్వడంలో నైపుణ్యం కలిగిన అనేక మంది పెట్టుబడి సలహాదారులు ఇండియాలో ఉన్నారు. ఈ సలహాదారులు అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి ఆప్షన్లను అర్థం చేసుకోవడానికి, మీ అవసరాలకు తగిన పెట్టుబడులను ఎంచుకోవడానికి సహాయం చేస్తారు కూడా. సో.. స్వదేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఎన్నారైలు ఇలాంటి పెట్టుబడి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అప్పుడే మీ పెట్టుబడులు సురక్షితంగా, సరియైన మార్గంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

Updated Date - 2023-09-24T08:28:16+05:30 IST