ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఈ సౌదీ పెద్దాయన 30 ఏళ్లుగా కంటిమీద కునుకు లేదు.. వైద్యులు కూడా ఆయన జబ్బు ఏంటో చెప్పాలేకపోతున్నారు.. కానీ..

ABN, First Publish Date - 2023-06-06T10:49:51+05:30

మాములుగా ఒక రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోతేనే ఆ తర్వాతి రోజంతా కూడా ఎలాగో ఉంటది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: మాములుగా ఒక రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోతేనే ఆ తర్వాతి రోజంతా కూడా ఎలాగో ఉంటది. అలాంటిది కంటిన్యూస్‌గా 30 ఏళ్లపాటు కంటిమీద కునుకు లేకపోతే. బాబోయే.. ఊహించుకుంటేనే ఎలాగో ఉంది కదూ. కానీ, సౌదీ అరేబియాలో ఓ 70 ఏళ్ల పెద్దాయనది ప్రస్తుతం ఇదే పరిస్థితి. మూడు దశాబ్ధాలుగా అసలు నిద్ర అనేదే లేకుండా గడిపేస్తున్నాడట. ఇక వైద్యులకు కూడా అతనికి ఉన్న జబ్బు ఏంటో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే ఈ పెద్దాయన గురించి ఎన్నో కథనాలు నెట్టింట దర్శనమిచ్చాయి. తాజాగా మరోసారి ఆయన ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచారు.

ఆయన పేరు సౌద్ బిన్ ముహ్మద్ అల్ ఘమ్దీ (Saud Bin Muhammad Al-Ghamdi). ఈ 70 ఏళ్ల పెద్దాయన అల్ బాహా రీజియన్‌లో నివాసం ఉంటారు. 2018లో తొలిసారి అల్ ఘమ్దీ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. దాంతో దశాబ్దాలుగా నిద్రపోకుండా ఉండడం ఏంటని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఆయన మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒకసారి డ్యూటీలో భాగంగా ఓ కీలక ఆపరేషన్‌కు వెళ్లారట అల్ ఘమ్దీ. ఆ సమయంలో వరుసగా 20రోజుల పాటు కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సి వచ్చిందట. ఆ తర్వాత కొన్నాళ్లు సర్వీస్ చేసి పదవీ విరమణ పొందారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం అంతబాగానే ఉంది. ఆ తర్వాత సమస్య మొదలైందట.

Viral Video: ఇది దైవ లీలేనా..? డాక్టర్లకే అంతుచిక్కని విచిత్రం.. మూడు రోజుల పాప ఎన్ని సిత్రాలు చేస్తోందో మీరే చూడండి..!


మొదట ఒక రోజు.. రెండు రోజులు.. వరుసగా నిద్ర వచ్చేది కాదట. ఆ తర్వాత ఈ నిద్రలేమి సమస్య మెల్లగా రోజుల నుంచి నెలలకు చేరింది. అది కాస్తా ఏళ్లుగా మారింది. అంతే.. గడిచిన 30 ఏళ్లుగా 'నో స్లీప్'. ఇక తన సమస్య గురించి అల్ ఘమ్దీ తిరగని ఆస్పత్రి అంటూ లేదట. కానీ, ఎక్కడ తన సమస్యకు పరిష్కారం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇన్నేళ్లుగా అసలు కంటిమీద కనుకు లేకున్న ఇప్పటికీ ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదట. మానసికంగా, శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారాయన. కాగా, అల్ ఘమ్దీ నిద్రలేమి సమస్య గురించి తెలిసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'ఆయన నిద్రలేమి సమస్యకు చికిత్స దొరకాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాని' ఒకరు, 'ఆ పెద్దాయనకు షుగర్ వాడకాన్ని, టీ తాగడం మానేయమని చెప్పండి' అని మరొకరు, 'ఈ మనిషిని పశ్చిమ దేశాలకు వైద్య చికిత్స కోసం పంపండి. దీన్ని నిపుణులచే క్షుణ్ణంగా తనిఖీ చేయించాల్సిన అవసరం ఉంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-06T10:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising