Visit Visa: సౌదీ కొత్త 'విజిట్ వీసా'.. ప్రత్యేకంగా ఎవరి కోసమంటే..
ABN , First Publish Date - 2023-06-09T10:00:21+05:30 IST
అరబ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కొత్త విజిట్ వీసాను (Visit Visa) ప్రకటించింది.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా తాజాగా కొత్త విజిట్ వీసాను (Visit Visa) ప్రకటించింది. 'విజిటర్ ఇన్వెస్టర్' (Visitor Investor) పేరుతో ఈ కొత్త బిజినెస్ విజిట్ వీసాను (Visit Visa for Business) తీసుకొస్తున్నట్లు సౌదీ వెల్లడించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of Foreign Affairs) తో కలిసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ కొత్త రకం వీసాను ప్రకటించింది. ఇక కింగ్‌డమ్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి రంగంలో విదేశీ పెట్టుబడిదారుల అన్వేషణను సులభతరం చేయడం, వ్యాపారవేత్తలకు దేశంలోని పెట్టుబడి వాతావరణంపై లోతైన అవగాహనను పొందే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యంగా 'విజిటర్ ఇన్వెస్టర్' వీసాను ప్రవేశపెడుతోంది సౌదీ.
సౌదీ అరేబియా రాయబార కార్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం వీసా కోసం దరఖాస్తుదారులకు కావాల్సిన ధృవపత్రాలివే..
* 6నెలల వ్యాలిడిటీతో కూడిన ఒర్జినల్ పాస్‌పోర్ట్, కనీసం రెండు ఖాళీ వీసా పేజీలు.
* https://enjazit.com.sa/ ద్వారా లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్ నింపడంతో పాటు వీసా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నాన్-యూఎస్ సిటిజన్లు తప్పనిసరిగా కింగ్‌డమ్‌కు చెందిన ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాలి.
* అమెరికా పౌరులు కానివారి కోసం గ్రీన్ కార్డ్ కాపీ లేదా యూఎస్‌లో చట్టపరమైన నివాసాన్ని నిర్ధారించే పత్రం ఉండాలి.
* సౌదీ అరేబియా, అమెరికాలో కంపెనీ వ్యాపార నమోదు కాపీ కావాలి.
Kuwait: ప్రవాసులకు కొత్త పరీక్ష.. ఫెయిల్ అయితే తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..!