Saudi Arabia: షాకింగ్ న్యూస్.. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 16,649 మంది వలసదారులు అరెస్ట్..!

ABN , First Publish Date - 2023-03-26T12:05:33+05:30 IST

ఉల్లంఘనదారులపై (Violators) అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది.

Saudi Arabia: షాకింగ్ న్యూస్.. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 16,649 మంది వలసదారులు అరెస్ట్..!

రియాద్: ఉల్లంఘనదారులపై (Violators) అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన వారం రోజుల వ్యధిలోనే ఏకంగా 16,649 మంది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారులను అదుపులోకి తీసుకుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) తెలిపిన వివరాల ప్రకారం మార్చి 16 నుంచి 22వ తేదీల మధ్య కింగ్‌డమ్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సెక్యూరిటీ ఫోర్సెస్ (Security Forces) నిర్వహించిన తనిఖీలలో ఇలా రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 16,649 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 9,259 మంది రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘనదారులు ఉంటే.. 4,899 మంది బార్డర్ సెక్యూరిటీ రూల్స్, 2,491 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 1,132 మంది చట్టవిరుద్ధంగా కింగ్‌డమ్‌లోకి ప్రవేశించిన వారు ఉన్నారట. వారిలో 45శాతం మంది యెమనీలు, 52శాతం మంది ఇథియోపియన్స్, 3శాతం ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక 68 మంది మాత్రం చట్టవిరుద్ధంగా దేశం దాటిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డరని చెప్పారు. ఇక పట్టుబడిన 16,649 మందిలో 12,765 ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక సూచన చేసింది. ఎవరైనా చొరబాటుదారుని కింగ్‌డమ్‌లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేసిన లేదా అతనికి రవాణా లేదా ఆశ్రయం లేదా ఏదైనా సహాయం చేసిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 1మిలియన్ సౌదీ రియాళ్ల (రూ.) జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: అసలు గల్ఫ్ దేశంలో ఏం జరుగుతుంది..? ప్రవాసులను షాపింగ్స్ చేయకుండా నిరోధించడం ఏంటి..?!

Updated Date - 2023-03-26T12:05:33+05:30 IST