WTO: ప్రపంచ పర్యాటకంలో దూసుకెళ్తున్న సౌదీ అరేబియా.. టాప్ టూరిజం డెస్టినేషన్స్‌లో చోటు.. కారణాలివే..

ABN , First Publish Date - 2023-05-19T08:58:44+05:30 IST

ప్రపంచ పర్యాటకంలో అరబ్ దేశం సౌదీ అరేబియా దూసుకెళ్తోంది. ప్రతియేటా సౌదీని విజిట్ చేస్తున్న ప్రపంచ పర్యాటకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా వెలువడిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2022లో అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించిన అగ్ర దేశాల్లో సౌదీ కూడా ఒకటిగా చోటు దక్కించుకుంది.

WTO: ప్రపంచ పర్యాటకంలో దూసుకెళ్తున్న సౌదీ అరేబియా.. టాప్ టూరిజం డెస్టినేషన్స్‌లో చోటు.. కారణాలివే..

రియాద్: ప్రపంచ పర్యాటకంలో అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) దూసుకెళ్తోంది. ప్రతియేటా సౌదీని విజిట్ చేస్తున్న ప్రపంచ పర్యాటకుల (World Tourists) సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా వెలువడిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (World Tourism Organisation) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2022లో అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించిన అగ్ర దేశాల్లో సౌదీ కూడా ఒకటిగా చోటు దక్కించుకుంది. 2019లో ఈ జాబితాలో 25వ ర్యాంకులో ఉన్న అరబ్ దేశం తాజాగా వెలువడిన ఇండెక్స్‌లో 12 స్థానాలు మెరుగుపరచుకుని ఏకంగా 13వ ర్యాంక్ సొంతం చేసుకుంది. గతేడాది 16.6 మిలియన్ల మంది వరల్డ్ టూరిస్టులు సౌదీని విజిట్ చేసినట్లు డబ్ల్యూటీఓ ప్రపంచ పర్యాటక బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది.

ఇక ఈ నివేదిక ప్రకారం.. ఆదాయ సూచికలో కింగ్‌డమ్ 16 స్థానాలు (2019లో 27వ ర్యాంక్) ఎగబాకి 2022లో 11వ స్థానానికి చేరింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికం వరకు సుమారు 7.8 మిలియన్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు సౌదీని సందర్శించారు. ఇది 2019లో ఇదే కాలపరిమితితో పోలిస్తే 64శాతం మేర పెరిగింది. కాగా, తాజాగా వెలువడిన డబ్ల్యూటీఓ డేటా ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానాల జాబితాలో సౌదీ అరేబియా రెండో స్థానంలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్- ఖతీబ్ మాట్లాడుతూ ఈ విజయం వరల్డ్ టూరిజం మ్యాప్‌లో సౌదీ స్థానాన్ని మెరుగుపరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ప్రయాణ వీసా విధానాలను మరింత సులభతరం చేయడం, ప్రధాన గమ్యస్థాన దేశాలలో పర్యాటకం గురించి ప్రచారం నిర్వహించడం, కింగ్‌డమ్‌లో పర్యాటక గమ్యనస్థానాల వైవిధ్యం తదితర విషయాలే ఈ పురోగతికి ప్రధాన కారణమని మంత్రి తెలిపారు.

Swastika symbol: 'స్వస్తిక్‌' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!


ఇక సౌదీని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చాలని లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో మంత్రిత్వశాఖ ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. అటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum) విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో (Travel and Tourism Development Index) కూడా సౌదీ అరేబియా ఏకంగా 33వ ర్యాంకును దక్కించుకోవడం విశేషం. 2019తో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుందని మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. ఇలా సౌదీ ప్రస్తుతం ప్రపంచ పర్యాటకంలో జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తూ.. మంచి ఫలితాలు సాధిస్తోంది.

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

Updated Date - 2023-05-19T08:59:31+05:30 IST