Saudi Arabia: సౌదీలో విదేశీ కార్మికుల నియామకాలకు కొత్త వ్యవస్థ.. ఇకపై..!
ABN, First Publish Date - 2023-04-06T07:50:17+05:30
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ కార్మికుల నియామకాలకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విదేశీ కార్మికుల నియామకాలకు సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆ దేశ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Development ) నైపుణ్యాల ఆధారంగా కొత్త నియామక వ్యవస్థ (New Recruitment System ) కోసం మూడు ప్రతిపాదిత నమూనాలను ప్రవేశపెట్టింది. సౌదీ వర్క్ వీసా వ్యవస్థను (Saudi Work Visa System) మెరుగుపరిచే లక్ష్యంతో మంత్రిత్వశాఖ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ నమూనాలను భాగం చేసింది. కింగ్‌డమ్‌లో ఉత్పాదకత, ఆవిష్కరణ స్థాయిలను పెంచే లక్ష్యంతో ప్రతిపాదిత నమూనాలు అధిక, మధ్యస్థ, తక్కువ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. మరింత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను ఆకర్షించే పథకంలో భాగంగా స్కిల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను (Skill Verification Program) గతేడాది ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. మొదటి దశలో నైపుణ్య పరీక్ష కోసం మొత్తం 23 వృత్తులలోంచి ఐదింటిని ఎంపిక చేసింది. వీటిలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, రిఫ్రిజిరేషన్/ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, ఆటోమొబైల్ ఎక్ట్రీషియన్ ఉన్నాయి.
Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!
Updated Date - 2023-04-06T07:54:04+05:30 IST