Dubai: వైరల్‌గా మారిన బుడ్డోడి ఇంటర్వ్యూ.. అది చూసి బంపరాఫర్ ఇచ్చిన దుబాయ్ యువరాజు!
ABN, First Publish Date - 2023-07-06T12:30:19+05:30
దుబాయి అంటేనే ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఎటూ చూసిన ఎత్తైన భవంతులతో చూపు తిప్పుకోలేనంతగా సుందర మనోహరంగా ఉంటది దుబాయి.
అబుదాబి: దుబాయి అంటేనే ఆకాశహర్మ్యాలకు పెట్టింది పేరు. ఎటూ చూసిన ఎత్తైన భవంతులతో చూపు తిప్పుకోలేనంతగా సుందర మనోహరంగా ఉంటది దుబాయి. ఇక ఇక్కడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అందుకే చాలామంది ఈ నగరాన్ని విజిట్ చేస్తుంటారు. ఓ కువైటీ బాలుడు (Kuwaiti boy) కూడా ఇలాగే దుబాయిపై తన ఆసక్తిని ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టాడు. ఒక్కసారైన బుర్జ్ ఖలీఫాను (Burj Khalifa) దగ్గరి నుంచి చూడాలని తన కోరికను ఈ సందర్భంగా బుడతడు బయటపెట్టాడు. ఆ ఇంటర్వ్యూ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆ తర్వాత దుబాయ్ యువరాజు షేక్ హమద్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ (Sheikh Hamdan Bin Mohammed Bin Rashid Al Maktoum) దృష్టికి వెళ్లడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చూసిన దుబాయి క్రౌన్ ప్రిన్స్ (Crown Prince of Dubai) ఆ బుడ్డోడికి తన కుటుంబ సభ్యులతో సహా దుబాయిని విజిట్ చేసే బంపరాఫర్ ఇచ్చారు. అతడి టూర్‌కు అయ్యే వ్యయంతో పాటు దగ్గరుండి అతడికి దుబాయ్ నగరమంతటిని చూపించాల్సిందిగా అధికారులను ఆదేశించారు కూడా.
ఇలా దుబాయి యువరాజు నుంచి బంపరాఫర్ (Bumper Offer) కొట్టేసిన ఆ పిల్లాడి పేరు బదర్. కువైత్‌లో ఉండే బదర్.. ఇప్పటికే ఒకసారి యూఏఈ వెళ్లాడట. ఆ సందర్భంగా బుర్జ్ ఖలీఫాకు కొంచెం దూరంలో ఉండే ఓ స్టార్‌బక్స్ స్టోర్‌లో కూర్చునప్పుడు తన తండ్రి.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి అని తనతో చెప్పినట్లు బదర్ తెలిపాడు. దాంతో వెంటనే తన తండ్రి ఫోన్ తీసుకుని ఆ సుందర మనోహరమైన భవంతి దృశ్యాలను బంధించినట్లు చెప్పాడు. అప్పటి నుంచి ఒక్కసారైన బుర్జ్ ఖలీఫాను దగ్గరి నుంచి చూడాలని అనుకుంటున్నట్లు ఆ ఇంటర్వ్యూలో బదర్ (Badar) వెల్లడించాడు. ఇలా బుర్జ్ ఖలీఫా, దుబాయి గురించి అతడు ఎంతో ఆసక్తికరంగా మాట్లాడడం క్రౌన్‌ప్రిన్స్ ఆకట్టుకుంది. వెంటనే తన ఇన్‌స్టా ఖాతా ద్వారా స్పందిస్తూ బదర్కు దుబాయి నగరంతో పాటు బుర్జ్ ఖలీఫాను ఫ్యామిలీతో కలిసి సందర్శించే బంపరాఫర్ ఇచ్చారు. దీంతో బదర్ ఆనందానికి అవధుల్లేవు. స్వయంగా దుబాయి యువరాజు నుంచి ఆఫర్ రావడం నమ్మలేకపోతున్నానని ఎగిరిగంతేస్తున్నాడు.
Abu Dhabi Big Ticket: భారత ప్రవాసుడికి జాక్‌పాట్.. రాత్రికి రాత్రే బ్యాంక్ ఖాతాలోకి రూ.33కోట్లు..!
Updated Date - 2023-07-06T12:30:19+05:30 IST