NRI: రూ.1.25 కోట్లు ఆమెకు చెల్లించాల్సిందే.. ఓ ఎన్నారైకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు.. అసలు కథేంటంటే..!
ABN, First Publish Date - 2023-10-26T09:33:31+05:30
భార్యను వదిలేసి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ ఎన్నారైకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఆమెకు రూ. 1.25కోట్లు చెల్లించాల్సిందిగా సదరు ఎన్నారైకి కోర్టు ఆదేశించింది.
ఎన్నారై డెస్క్: భార్యను వదిలేసి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఓ ఎన్నారైకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) షాక్ ఇచ్చింది. ఆమెకు రూ. 1.25కోట్లు చెల్లించాల్సిందిగా సదరు ఎన్నారైకి కోర్టు ఆదేశించింది. అది కూడా అతని తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను విక్రయించి వచ్చిన సోత్తు నుంచి ఆమెకు రూ.1.25కోట్లు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. లేనిపక్షంలో ఎన్నారై ఆస్తులను జప్తు చేసి, భార్య పేరుపై మార్చాలని తేల్చి చెప్పింది.
UAE: నివాసితుల వీసా, పాస్‌పోర్ట్ వివరాల కోసం.. యూఏఈలో మరో నయా టెక్నాలజీ
అసలు కథేంటంటే.. వరుణ్ అనే ఎన్నారై తన భార్యను వదిలేసి, ఆస్ట్రేలియా (Australia) లో వెల్లి స్థిరపడ్డాడు. పైగా ఆమెకు భరణం ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. దాంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. ఆమె తరపు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని బెంచ్ న్యాయస్థానంలో తన వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా భార్యను అన్యాయంగా వదిలేసి, ఆస్ట్రేలియా పారిపోయిన ఎన్నారై (NRI) తాలూకు ఆస్తులను అమ్మి ఆమెకు చెల్లించాలని కోరింది. జస్టిస్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వరుణ్‌కు తండ్రి మోహన్ గోపాల్ నుంచి వచ్చిన ఆస్తులను వెంటనే విక్రయించాలని తెలిపింది. వరుణ్ పేరుపై ఉన్నా ఆరు దుకాణాలను అమ్మకానికి పెట్టాల్సిందిగా రిజిస్ట్రారర్‌ను ఆదేశించింది. అలా ఆస్తులు విక్రయించగా వచ్చిన నగదు నుంచి భార్యకు రూ.1.25కోట్లు చెల్లించాల్సిందిగా సూచించింది. లేనిపక్షంలో ఆ ఆస్తులను జప్తు చేసి ఆమె పేరుపై రిజిస్టర్ చేయాలని తెలిపింది.
Second salary in UAE: యూఏఈ సెకండ్ శాలరీ స్కీమ్స్.. సబ్‌స్క్రిప్షన్‌లో భారతీయ ప్రవాసులే టాప్
Updated Date - 2023-10-26T09:33:31+05:30 IST