ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dance Fest: నృత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగు తరంగిణి

ABN, First Publish Date - 2023-05-03T07:28:57+05:30

తెలుగు వారు ఎక్కడ ఉంటే ఏమి, తమలో ఉన్న కళ అభిరుచులను వీలయిన విధంగా వ్యక్తీకరిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు వారు ఎక్కడ ఉంటే ఏమి, తమలో ఉన్న కళ అభిరుచులను వీలయిన విధంగా వ్యక్తీకరిస్తుంటారు. అందునా నృత్యానికి సరిహద్దులు లేవు. ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా అత్యంత వైవిధ్యభరితమైన సంస్కృతులు, సంప్రదాయాలు భారతమాతకు సొంతం. దేశంలోని ప్రతి కొద్ది దూరానికి నృత్య రూపాలు అవి జానపద లేదా శాస్త్రీయ నృత్యం అక్కడి భౌగోళిక పరిస్ధితులకు అనుగుణంగా మారుతుంది. ఉపాది కొరకు గల్ఫ్ దేశాలకు వచ్చే తెలుగు కుటుంబాలలో అనేక మందిలో నృత్య నైపుణ్యం ఉంది.

ఇటీవల అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని యూఏఈలోని రాస్ అల్ ఖైమా నగరంలో తెలుగు ప్రవాసీ సాంస్కృతిక సంఘమైన తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో నృత్యోత్సవం (Dance Fest) ఘనంగా నిర్వహించారు. దేశంలో ప్రజాదరణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం, కథక్, కథకళి, ఒడిస్సీ, మోహినీ ఆట్టం) జానపద, గిరిజన నృత్యాలు, పాశ్చాత్య, దేశీయ నృత్యాలను మేళవించి రూపొందించిన సినీ నృత్య ప్రదర్శనలు అలరించాయి.

ఈ సందర్భంగా తెలుగు తరంగిణి ప్రధాన కార్యదర్శి సత్యానంద కోకా మాట్లాడుతూ, భారతదేశం అనేక కళలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలు పుట్టాయి. క్రీ.పు. మూడవ శతాబ్ధంలో భరతముని నాట్యశాస్త్రమనే ప్రఖ్యాతమైన గ్రంథాన్ని రాశాడు. భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం. భిన్న సంస్కృతులతో కూడిన భారతదేశం భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది. శాస్త్రీయ నృత్యం అనేది అభినయం, నాట్యం కలిసి ఉండాలి అని వివరించారు.

తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వేంకట సురేష్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఆస్కార్ విజేతగా నిలచిన 'నాటు నాటు' నృత్యం మన తెలుగు సినిమారంగం నుంచి రావటం మన అందరికీ గర్వకారణమని చెప్పారు. వివిధ నాట్య రీతులను ప్రదర్శిచటానికి వచ్చిన కళాకారులందరికీ శుభాభినందనలు తెలిపారు. భారతీయ కలలు, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత తల్లి దండ్రులపై వున్నదని, పిల్లలను ఆ విధాంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలుగు తరంగిణి బృందం సభలు రాజేష్ చమర్తి, శ్రీనివాసరావు చిరుతనగండ్ల, ప్రసాద్ దిరిసాల, మట్టుపాలి నాగ వెంకట కేదార్, రాఘవేంద్ర రవి, యేల్చూరి శరత్, శివానంద్ రెడ్డి, వీర, రాఘవేంద్ర, మోహన్ ముసునూరి, సమంత్ కుమార్, బ్రహ్మనాద రెడ్డి, భీమ్ శంకర్, తధితరులు సహాయ సహకారులు అందించారు. తెలుగు తరంగిణి సభ్యురాలు, వ్యాఖ్యత సురేఖ పట్నం కార్యక్రమాన్ని ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా నిర్వహించిన విధానం అహుతులను మంత్ర ముగ్దులను చేసింది.

దుబాయిలోని ఇన్వెస్టర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐజీపీయల్) సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని ఏమిరేట్లకు చెందిన కళాభిమానులు పాల్గొన్నట్లుగా నిర్వహకులు తెలిపారు. ఫోర్లన్స్ విమల బృందం, శ్రీవారి పాదాలు నాట్య కళాశాల (హైదరాబాద్) విద్యార్థుల భరతనాట్యం, తన్మయి నాట్య కళాశాల (దుబాయి) విద్యార్థుల కూచిపూడి నృత్యాలు భారత్, యూఏఈలో వివిధ ఎమిరేట్స్ నుండి వచ్చిన 75 మంది నాట్య కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా శ్రీవారి పాదాలు నృత్య కళాశాల, హైదరాబాద్ స్థాపకురాలు నాల్ల రమాదేవి, తన్మయి నృత్య కళాశాల దుబాయ్ స్థాపకులు తాతంబొట్ల ప్రీతి సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. కరతాళ ధ్వనుల మద్య నాల్ల రమాదేవికి "నాట్యకళా శిరోమణి" బిరుదును ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి IGPL, కళ్యాన్ జ్యూయలర్స్, ట్రాన్స్ ఏసియా, మాయ్ దుబాయ్, అల్ మరాయ్, సితారా రెస్టారెంట్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్ స్పాన్సర్ చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-05-03T07:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising