ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Election: తెలంగాణ ఎన్నికలకు 3 నెలల ముందు 3 ప్రధాన పార్టీల పరిస్థితి ఇదీ!..

ABN, First Publish Date - 2023-08-16T18:09:11+05:30

హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ బీఆర్ఎస్ (BRS).. ఈసారి అధికారం హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్ (Congress).. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ (BJP).. ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..

హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ బీఆర్ఎస్ (BRS).. ఈసారి అధికారం హస్తగతమవుతుందంటూ కాంగ్రెస్ (Congress).. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం పక్కా అంటూ బీజేపీ (BJP).. ఇలా తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ చివరినాటికల్లా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాలకు పదునుపెడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోరు ఖాయమనే విశ్లేషణల నేపథ్యంలో ఆ మూడు పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఆయా పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యచరణ మొదలుపెట్టగా.. మరిన్ని వ్యూహాలు, ప్రణాళికలపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మూడు నెలల ముందు తెలంగాణలో రాజకీయ పక్షాల సన్నద్ధతపై ఒక లుక్కేద్దాం...

బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు!

కాంగ్రెస్ తమకు పోటీనే కాదంటూ.. తమను ఢీకొట్టే సత్తా బీజేపీకి లేదని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ అదంతా పైపైకేనని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోలోన ఆ పార్టీ కలవరపాటుకు గురవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రూపంలో ముప్పుపొంచివుందని గ్రహించిన గులాబీ దళపతి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్నారట. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో ఈసారి ప్రజావ్యతిరేకత తప్పదనే అంచనాలు బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నాయట. తేడా పడితే అధికారం చేజారిపోతుందనే భయం ఆ పార్టీని వెంటాడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే వీలైనన్ని తాయిళాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఉన్నపళంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, ఇండ్ల పంపిణీతోపాటు ఈమధ్య చాలా కార్యక్రమాలు ఈ కోవ కిందికే వస్తాయి.

ఇక పార్టీపరంగా చూసినా క్షేత్రస్థాయిలోనూ బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం కనిపించకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోందట. ముఖ్యంగా కొన్ని పథకాల్లో స్వయంగా ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడం చేటు చేస్తుందేమోనని భయం పట్టుకుందట. సిట్టింగుల్లో పలువురికి సీట్లు దక్కడం కష్టమేననే విశ్లేషణలు ఆ పార్టీ శ్రేణుల కలవరానికి అద్దం పడుతోందనే విశ్లేషణలున్నాయి. మరోవైపు.. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించగా.. వడపోతలపై గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిపెట్టారని తెలుస్తోంది. అసంతృప్తులు పార్టీని వీడే అవకాశం ఉండడంతో ఆచితూచి వ్యవహరించేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.


అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ దృష్టి..

రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్‌కు (Congress) ఒకింత మైలేజీ ఉంది. ఆ ధైర్యంతోనే ఒక్క ఛాన్స్ పేరిట హస్తంపార్టీ ఓటర్ల ముందుకెళ్తోంది. అయితే 2018లో అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడిన ఆ పార్టీ ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలని భావిస్తోంది. అన్నీ పార్టీల కంటే ముందే ఈసారి అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. గెలుపు గుర్రాల కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. టికెట్ల విషయంలో తీవ్ర పోటీ ఉండడంతో సర్వేల ఆధారంగా ఖరారు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధిష్టానం ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించింది. ఇటివలే సునీల్ కనుగోలు టీమ్ కీలక సర్వే రిపోర్టును అధిష్ఠానం చేతిలో పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో 41 స్థానాలను కాంగ్రెస్ సునాయాసంగా ఖాతాలో వేసుకుంటుందని లెక్కగట్టింది. మరో 42 సీట్లో కష్టపడితే గెలవొచ్చని, మిగతా స్థానాల్లో పార్టీ బలహీనంగా ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని స్ర్కీనింగ్ కమిటీకి పంపించాలని పార్టీ నిర్ణయించింది. మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలపై కూడా కాంగ్రెస్ దృష్టిసారించింది. తద్వారా పార్టీ బలంగా ఉందని చాటిచెప్పాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతల బహిరంగ సభల ద్వారా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు మీటింగ్‌లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక సందర్భం చిక్కిన ప్రతిసారి బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టడంపై కాంగ్రెస్ దృష్టిసారించింది. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని ప్రచారాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తోంది.


వేగం పెంచిన బీజేపీ..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర నాయకత్వంలో మార్పు అనంతరం పరిణామాలతో ఒకింత స్తబ్దుగా కనిపించిన తెలంగాణ బీజేపీ (Telangana BJP) తిరిగి పుంజుకుంటోంది. వేర్వేరు కార్యక్రమాల ద్వారా జనాల్లోకి దూసుకెళ్తున్న కాషాయదళం.. కేడర్‌లో జోష్ నింపడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. త్వరలోనే ప్రచారాన్ని కూడా ఉధృతం చేయాలని యోచిస్తోంది. ఈ నెల చివరిలో కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ రానున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కూడా అధిష్ఠానం దృష్టిసారించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరిగానే వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే లక్ష్యంగా కసరత్తులు మొదలుపెట్టింది. ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల ఆరంభంలో 35-40 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా కూడా ప్రకటించే అవకాశముందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకైతే పరిస్థితి ఇలా ఉన్నా.. అధికారమే లక్ష్యంగా ఏ పార్టీ ఏవిధంగా రేసులో దూసుకెళ్తుంది? ఎన్నికలలోపు ఎన్ని వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉంటాయి ? అనే అంశాల్లో మాత్రం వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-08-16T18:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising