ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS MLC Kavitha : ఆ అరగంట ఏం జరిగింది..?.. కవిత ఈడీ విచారణ హైడ్రామాలో వెలుగులోకి సీక్రెట్ కోణం..!

ABN, First Publish Date - 2023-03-16T12:54:57+05:30

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) గురువారం నాడు (మార్చి-16న) విచారణకు హాజరు కావాల్సి ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) గురువారం నాడు (మార్చి-16న) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ విచారణ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి హస్తిన వేదికగా పెద్ద హైడ్రామానే జరిగింది. కవిత విచారణ వెళ్తారా లేదా..? వెళ్తే పరిస్థితేంటి..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈడీ ఆఫీసు, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం (CM KCR Delhi House) దగ్గర కేంద్రబలగాలు భారీగా మోహరించడంతో అసలేం జరుగుతోందని అందరి దృష్టి హస్తినపైనే పడ్డాయి. ఉదయం 10 గంటలకే కవిత ప్రెస్‌మీట్ ఉంటుందని ముందుగానే అధికారికంగానే ప్రకటన చేశారు. అయితే 10 గంటలు దాటినా మీడియా ముందుకు రాలేదు. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు ఈడీ విచారణకు కవిత వెళ్లాల్సి ఉన్నా.. 11:30 గంటలు అయినా కవిత ఇంటి నుంచి బయటికి కూడా రాలేదు. దీంతో అరగంటపాటు కవిత.. నివాసంలో ఏం చేశారు..? ఎవరెవరితో చర్చించారు..? చివరికి ఏం నిర్ణయం తీసుకున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

10 గంటలకే మీడియా ముందుకు రావాల్సి ఉన్నా..!

ఉదయం 10 గంటలకే కవిత మీడియా (Kavitha With Media) ముందుకు వచ్చి కీలక విషయాలు మాట్లాడుతారని అందరూ భావించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మొదటిసారి ఈడీ విచారణ వ్యవహారం ఇవన్నీ క్లారిటీగా మాట్లాడుతారని బీఆర్ఎస్ శ్రేణులు (BRS Cadre) భావించాయి. అదికూడా ఈడీ విచారణకు (ED Enquiry) ముందు మీడియా మీట్ కావడంతో అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత నివాసం నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని మీడియా ప్రతినిధులు వేచి చూశారు. సీన్ కట్ చేస్తే.. 10 గంటలు దాటినా మీడియా ముందుకు రాలేదు. చివరికి 10.30 గంటలకు అయినా మీడియా మీట్ లేకపోవడంతో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. చివరికి మీడియా మీట్ రద్దయ్యింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యాయి.

ఆ అరగంట ఏం జరిగింది..?

ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇక 11 గంటలు సమయం కావడంతో ఈడీ విచారణకు బయల్దేరాల్సి ఉంది. ఈడీ ఆఫీసు నుంచి ఎస్కార్ట్ వాహనాలు కూడా కవిత ఉండే నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా 11 గంటలు అయినా ఇంటి నుంచి బయటికి రాలేదు. ఆఖరికి 11.30 గంటలు దాటినా కూడా కవిత బయటికి రాకపోవడం.. హాజరవుతారా.. లేదా..? అని ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. దీంతో 11 నుంచి 11:30 గంటల మధ్యలో కవిత ఏం చేశారు..? ఎవరెవరితో మాట్లాడారు..? ఎవరెవరితో భేటీ అయ్యారనే విషయాలు తెలుసుకోవడానికి జనం చాలా ఆసక్తి చూపించారు. మొదట మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో (Ministers KTR, Harish Rao) ఏం చేద్దాం.. ఎలా ముందుకెళ్దాం..? అని కవిత చర్చించారని తెలుస్తోంది. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అరగంటపాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిథులతో కవిత విచారణపై కీలకంగా చర్చించారు. సుదీర్ఘ చర్చల తర్వాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను విచారణకు హాజరుకాలేనని న్యాయవాదుల ద్వారా ఈడీకి కవిత సమాచారం పంపారు. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈ సమాచారాన్ని కవిత ఈడీకి చేరవేశారు. చివరికి ఎస్కార్ట్ వాహనాలు కవిత నివాసం నుంచి ఈడీ ఆఫీసుకు వెనుదిరిగాయి. ఇదే అరగంటపాటు కేసీఆర్ నివాసంలో జరిగింది.

కవిత రాలేనని చెప్పడం వెనుక..!

గురువారం నాడు ఈడీ విచారణపై స్టే కావాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్‌పై ఈనెల 24న విచారణ చేపడుతామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు తన న్యాయవాది ద్వారా పంపినట్లు మొదట తెలిసింది. ఆ తర్వాత అధికారికంగా కూడా.. సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. ఈడీ విచారణకు హాజరుకాలేనని కవిత తన న్యాయవాదుల (Kavitha Advocates) ద్వారా తెలిపారు. ఆ తర్వాత తాను అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేనని.. తనకు మరో తేదీని నిర్ణయించాలని కూడా న్యాయవాది ద్వారా కవిత కోరారు. అయితే కవిత విజ్ఞప్తిని ఈడీ అధికారులు అంగీకరించలేదు. ఆఖరికి మధ్యాహ్నం మూడు గంటలకు హాజరుకావాలని కవిత నిర్ణయించుకున్నట్లు ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తానికి చూస్తే.. ఇవాళ ఉదయం నుంచి ముఖ్యంగా 11 గంటల నుంచి 11:30 వరకు జరిగిన ఈ భేటీనే అటు హస్తినలో.. ఇటు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. మరి మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Kavitha ED Enquiry Live: విచారణకు రాలేనంటూ ఈడీకి కవిత లేఖ.. ‘నో’ చెప్పిన ఈడీ


******************************

TSPSC Paper Leak : టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక నిందితురాలు రేణుక ఎవరు.. ప్రవీణ్‌తో పరిచయం ఎలా.. పెద్ద కథే ఉందిగా..!


******************************

Janasena : పవన్ పదే పదే ‘కాపు’ ప్రస్తావన తేవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా.. ఇదేగానీ వర్కవుట్ అయితే..!


******************************


Updated Date - 2023-03-16T13:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising