Revanth In Janagarjana Sabha : తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్-9న అధికారంలోకి వస్తున్నాం..

ABN , First Publish Date - 2023-07-02T16:33:59+05:30 IST

కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగిస్తోందిది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు తలపెట్టింది...

Revanth In Janagarjana Sabha : తెలంగాణ ప్రకటన వచ్చిన డిసెంబర్-9న అధికారంలోకి వస్తున్నాం..

07:50 pm : ఢిల్లీ బయల్దేరిన రాహుల్

  • ఖమ్మం నుంచి గన్నవరం బయలుదేరిన రాహుల్‌గాంధీ

  • జనగర్జన సభలో ప్రసంగంతో జోష్‌ పెంచిన అగ్రనేత ప్రసంగం

  • ఎన్నికల హామీలు కూడా ప్రకటించిన రాహుల్

  • అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు చొప్పున పెన్షన్ ఇస్తాం

  • చేయూత పథకం ద్వారా అందిస్తాం

  • గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తామని రాహుల్ ప్రకటన

Rahul-Delhi.jpg


07:45 pm : అధికారంలోకి వచ్చేస్తున్నాం..

  • డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన వచ్చింది: రేవంత్‌ రెడ్డి

  • ఈ డిసెంబరు 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది

  • తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారు

  • బలిదానాలకు చలించిపోయిన సోనియాగాంధీ

  • 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చింది

  • కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను కొల్లగొట్టింది

  • కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలి

  • కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి

  • ఖమ్మం సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు

  • బస్సులు ఇవ్వలేదు.. లారీలను అడ్డుకున్నారు

  • రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించాం

  • ప్రియాంక సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించాం

  • ఇవాళ వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు పెన్షన్ ప్రకటించాం : రేవంత్ రెడ్డి

Revanth-Reddy.jpg


07:35 pm : అదిరిపోయిన స్పీచ్..!

  • తెలంగాణలో కర్ణాటక ఫలితాలు వస్తాయి: రాహుల్‌

  • కర్ణాటకలో అవినీతి సర్కార్‌ను గద్దె దించాం

  • తెలంగాణలో అవినీతి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

  • కేసీఆర్ కుంభకోణాలన్నీ ప్రధాని మోదీకి తెలుసు

  • దేశాన్ని జోడించేందుకు జోడో యాత్ర చేపట్టాను

  • కాంగ్రెస్ సిద్ధాంతాలను సమర్థించారు

  • కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నేతలు వీడలేదు

  • ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట

  • బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ (బంధువుల) సమితి

  • ఈ భూములు సీఎం కేసీఆర్‌ది కాదు.. ప్రజలది

  • ధరణితో భూములను కేసీఆర్‌ దోచుకుంటున్నారు

  • బీజేపీకి బీ టీంగా పనిచేసిన కేసీఆర్‌

  • తెలంగాణ ఓ స్వప్నంగా ఉండేది

  • మీ మనసుల్లో.. మీ రక్తంలో కాంగ్రెస్ ఉంది

  • తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది

  • తెలంగాణలో బీజేపీకి బీ టీంగా మారిన బీఆర్‌ఎస్‌

  • తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు మా వెన్నుముక

  • కర్ణాటక మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి పనిచేయాలి

  • కాంగ్రెస్‌లోకి వచ్చేవారికి మా ద్వారాలు తెరిచే ఉంటాయి

  • కాంగ్రెస్ ఆలోచనలు నచ్చినవారు పార్టీలోకి రావాలి: రాహుల్‌

Rahul-Spoee.jpg


07:30 pm : ఎన్నికల హామీలు ప్రకటన

  • ఖమ్మం సభలో ఎన్నికల హామీలు ప్రకటించిన రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ. 4వేలు చొప్పున పెన్షన్ ఇస్తాం

  • చేయూత పథకం ద్వారా అందిస్తాం

  • మేం అధికారంలోకి వస్తే గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తాం

Election-Hameelu.jpg


07:15 pm : విమర్శల వర్షం

  • మీ అందరి మనసుల్లో కాంగ్రెస్ ఉంది..

  • అందుకే మీరు కాంగ్రెస్ ఆలోచనలు సమర్థించారు

  • 9 ఏళ్ల పాలనలో ప్రజల కలలను బీఆర్ఎస్ నాశనం చేసింది

  • బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి

  • కేసీఆర్ తెలంగాణకు రాజుగా భావించుకుంటారు

  • తెలంగాణ తన జాగీరుగా అనుకుంటారు

  • పేదల భూములను తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటోంది

  • పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను నేను అభినందిస్తున్నా

  • భట్టి తెలంగాణలో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి బలహీనులకు అండగా నిలిచారు

  • పేదలకు అండగా నిలిచిన భట్టి విక్రమార్కను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను

  • బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటికి అభినందనలు : రాహుల్ గాంధీ

RRRR.jpg


07:08 pm : కర్ణాటక ఫలితాలొస్తాయ్..

  • తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలొస్తాయ్ : రాహుల్ గాంధీ

  • తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది

  • రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ బీటీమ్ మధ్యే పోరు

  • విపక్షాల భేటీకి బీఆర్ఎస్‌ పార్టీని ఆహ్వానించాలని.. అన్నిపార్టీలు కోరితే మేం విభేదించాం

  • కాంగ్రెస్‌లో నుంచి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగిరావాలి

  • తెలంగాణలో బీజేపీ బీ టీమ్, బీఆర్ఎస్‌ను ఓడించబోతున్నాం..

  • హైవేపై ప్రయాణిస్తుంటే నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి

  • అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన రాహుల్ గాంధీ

  • రాహుల్ ప్రసంగంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం

RRRR.jpg


06:55 pm : బంగాళాఖాతంలో కలిపేయాల్సిందే..

  • బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేయాల్సిందే : భట్టీ

  • భారత్ జోడోయాత్రకు కొనసాగింపే పీపుల్స్ మార్చ్ యాత్ర

  • పీపుల్స్ యాత్ర నా పాదయాత్ర కాదు.. యాత్రలో నన్ను అడగడుగునా ప్రజలు ప్రోత్సహించారు

  • రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారు

  • కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వమే : భట్టి విక్రమార్క

Bhatti.jpg


06:45 pm : కాంగ్రెస్‌కే సాధ్యం..

  • తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: పొంగులేటి

  • తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోతుందని తెలిసినా ఇచ్చారు

  • కేసీఆర్‌ మాటల గారడీతో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు

  • కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు

  • విద్యార్థుల పోరాటంతో సోనియా తెలంగాణ ఇచ్చారు

  • వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..

  • రైతు రుణాలు మాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చలేదు

  • రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు

  • భావి భారతదేశానికి దిక్సూచి రాహుల్‌గాంధీ

  • కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించగలదు

  • బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో పడేయటం కాంగ్రెస్‌కే సాధ్యం: పొంగులేటి

Ponguleti-Speech.jpg


06:30 pm : కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి..

  • కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

  • కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ

  • పొంగులేటితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ముఖ్యనేతలు

  • కేసీఆర్‌ తెలంగాణకు చేసిందేమీ లేదని పొంగులేటి విమర్శ

  • తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే

  • విద్యార్థులతో పోరాటంతోనే సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు

  • తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి

Ponguleti-Welcome.jpg


06:10 pm : గద్దర్ కొత్త పార్టీ లేనట్లే!

  • కాంగ్రెస్ జనగర్జన సభలో ప్రత్యక్షమైన ప్రజా యుద్ధనౌక గద్దర్

  • ఇటీవలే ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటన

  • జెండాలో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉంటుందని ప్రచారం

  • గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తారని పెద్ద ఎత్తున రూమర్స్

  • సీన్ కట్ చేస్తే.. ఖమ్మం సభలో ప్రత్యక్షమైన గద్దర్

  • గద్దర్ కొత్త పార్టీ లేనట్లేనని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు

  • రాహుల్‌ను ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్న గద్దర్

  • అనంతరం రాహుల్‌కు ముద్దుపెట్టిన గద్దర్

  • కొత్త పార్టీ లేనట్లేనని దాదాపు కన్ఫామ్ చేసేసిన గద్దర్!

  • సభకు వెళ్లే ముందు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన గద్దర్

  • కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టేనని.. కేసీఆర్ పాలన నిర్బంధపూరితంగా నడుస్తోందని విమర్శ

  • తెలంగాణ సమాజంపై నిర్బంధాలే పతనానికి నాంది- గద్దర్

Untitled-6.jpg


05:55 pm : నమస్తే.. నమస్తే..!

  • ఖమ్మం జనగర్జన సభకు చేరుకున్న రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి అగ్రనేత

  • వేదికపై తన సీటులో కూర్చున్న రాహుల్, రేవంత్ రెడ్డి

  • రాహుల్ పక్కనే కూర్చున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  • అగ్రనేతను సన్మానించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు

Rahul-at-Sabha-Vedhika.jpg


05:55 pm : రాహుల్ వచ్చారోచ్..!

  • గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఖమ్మం చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

  • మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్న యువనేత

  • కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ కారులో సభా ప్రాంగణానికి రాహుల్

Rahul-Helicofter.jpg


05:45 pm : సభా ప్రాంగణానికి భట్టీ

  • కాసేపట్లో సభా ప్రాంగణానికి సీఎల్పీ నేత భట్టీ పాదయాత్ర

  • 109 రోజులపాటు కొనసాగిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

  • జనగర్జన సభలో భట్టిని సన్మానించనున్న రాహుల్ గాంధీ

Sabha-V.jpg


05:40 pm : జనసంద్రంగా మారిన తెలంగాణ జనగర్జన

  • ఊహించనిదానికంటే భారీగానే తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

  • గత జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే జనగర్జన సభ

  • బీఆర్‌ఎస్‌ సభకు రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ పట్టుదలగా జన సమీకరణ

  • సభా స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్‌ స్ర్కీన్‌ ఏర్పాటు

Jana-Sandram.jpg


05:35pm : ఎక్కడ చూసినా ఈ జెండాలే..!

  • జనగర్జన సభలో ఎక్కడ చూసినా ‘జై పొంగులేటి’ అని దర్శనమిస్తున్న జెండాలు

  • జై శీనన్నా.. జై పొంగులేటి అని నినాదాలతో హోరెత్తిస్తున్న వీరాభిమానులు, అనుచరులు

Jai-Ponguleti.jpg


05:25pm : భారీగా ట్రాఫిక్ జామ్

  • ఖమ్మం పట్టణంలోని శ్రీశ్రీ సర్కిల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

  • కలెక్టరేట్ వరకు కిలోమీటరు మేర నిలిచిపోయిన వాహనాలు

  • ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

  • ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు

  • రూట్ మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు

Traffic.jpg


05:15pm : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్

  • గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

  • ఘన స్వాగతం పలికిన ఏపీ కాంగ్రెస్ నేతలు

  • గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన రాహుల్

  • కాసేపట్లో ఖమ్మం సభకు చేరుకోనున్న యువనేత

  • స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

Rahul-Gandhi.jpg


05:08 pm : వేదికపైకి చేరుకున్న పొంగులేటి

  • ముఖ్య అనుచరులతో కలిసి సభా వేదికపైకి చేరుకున్న పొంగులేటి

  • అంతకుముందు ఎంపీ కోమటిరెడ్డితో కలిసి సభా ప్రాంగణానికి భారీ కాన్వాయ్‌తో వచ్చిన పొంగులేటి

  • పొంగులేటి సభ దగ్గరికి రాగానే నినాదాలతో హోరెత్తిన వైనం

Ponguleti.jpg


05:05 : కాంగ్రెస్ చెప్పింది.. చెప్పినట్లుగానే..

  • కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అదే జరుగుతుంది : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • కాంగ్రెస్ని చూసి బీఆర్ఎస్ వణికిపోతోంది

  • రాహుల్ సభకు ప్రజలు అశేషంగా తరలివస్తున్నారు

  • స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు

  • ఈ సభ ద్వారా బీఆర్ఎస్ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తాం

  • శ్రీనివాసరెడ్డి ఏదైతే చెప్పాడో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా..

  • బీఆర్ఎస్ అభ్యర్థులను చెప్పారు అందుకు అనుగుణంగా కార్యకర్తలు నాయకులు ఐక్యంగా పనిచేయాలి

  • తెలంగాణలో కాంగ్రెస్ ప్రభజనం రాబోతోంది : కోమటిరెడ్డి

Jana.jpg


05:00 : సభకు బయల్దేరిన పొంగులేటి..

  • ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి సభకు బయల్దేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • భారీ ర్యాలీతో రాహుల్ సభా ప్రాంగణానికి పయనం

Congress-Sabha.jpg


04:51pm : రాహుల్ రాకకోసం ఎదురుచూపులు

  • జనసంద్రంగా మారిన జనగర్జన సభ

  • దారులన్నీ ఖమ్మం సభ వైపే..

  • రాహుల్ రాకకోసం కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపు

  • కాసేపట్లో గన్నవరం చేరుకోనున్న రాహుల్ గాంధీ

  • రాహుల్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు

Rahul-Kosam.jpg


04:41pm : సభావేదికను చేరుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు

  • జనాగర్జన సభావేదికకు చేరుకుంటున్న అగ్రనేతలు

  • సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలైన సభ

  • భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

  • రాష్ట్రం నలుమూలల నుంచి జనాన్ని తరలించిన కాంగ్రెస్ నేతలు

Sabha-Vedhika.jpg


కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగిస్తోంది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు తలపెట్టింది. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీతో (Rahul Gandhi) పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు మరికాసేపట్లో సభావేదికపైకి విచ్చేయనున్నారు. ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో ఆదిలాబాద్‌లో మొదలైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర (Bhatti Padayatra) 1,360 కిలోమీటర్ల మేర కొనసాగి ఖమ్మంలో ముగుస్తున్న సందర్భం ఒకవైపు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంగ్రెస్‌లో చేరుతున్న తరుణం మరోవైపు.. వెరసి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ సభ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత జనవరి 18న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ జరిగిన ప్రదేశానికి సమీపంలోనే కాంగ్రెస్‌ పార్టీ జనగర్జన సభను ఏర్పాటు చేసింది. బీఆర్‌ఎస్‌ సభకు రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ పట్టుదలగా జన సమీకరణ చేసింది. సభా స్థలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు కనబడేలా 50 అడుగుల ఎత్తున భారీ డిజిటల్‌ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

Janagarjana.jpg

చేరికలు ఇలా..!

మొదట.. ఆదివారం సాయంత్రం 4.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రాహుల్‌గాంధీ రానున్నారు. అక్కడ ఏపీసీసీ అధ్యక్షుడితోపాటు ఇతర నేతలు రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు ఖమ్మంలోని సభా స్థలికి చేరుకుంటారు. 5.30 గంటలకు సభావేదికపైకి వస్తారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ సన్మానించనున్నారు. అదే వేదికపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు వారి అనుచరులు రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నారు. వీరితో పాటు పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసురాజు, ఇతర ముఖ్యనాయకులు ఈ సభలో పాల్గొననున్నారు.

WhatsApp Image 2023-07-02 at 4.33.21 PM.jpeg

రాహుల్ ఏం మాట్లాడుతారో..?

కాగా.. సన్మానం, చేరికల తర్వాత సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. అయితే రాహుల్ ప్రసంగంపై కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాహుల్ కీలక ప్రకటన ఏమైనా చేస్తారా..? సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా..? మేనిఫెస్టో ఏమైనా ప్రకటిస్తారా..? రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితుల గురించి ఏం మాట్లాడుతారో అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ప్రసంగం ముగిశాక తర్వాత సాయంత్రం 7 గంటలకు బయలుదేరి.. రాత్రి 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Updated Date - 2023-07-02T20:19:34+05:30 IST