ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Himanshu: హిమాన్షు మాములోడు కాదుగా.. మైలేజ్ కోసమే ఇలా చేశాడా?

ABN, First Publish Date - 2023-07-13T14:40:04+05:30

హిమాన్షు చేసే పనులు చిన్నపిల్లల తరహాలో లేకుండా తాను పెద్దవాడినని చెప్పుకునే తరహాలో ఉంటున్నాయని నెటిజన్‌లు చెప్పుకుంటున్నారు. నిజానికి హిమాన్షు ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ కోసంం తన జేబులో నుంచి రూ.కోటి ఖర్చు చేయలేదు. ఫండ్ రైజింగ్ చేశాడు. సీఎం మనవడు, మంత్రి తనయుడు అంటే గొప్ప గొప్ప సంస్థలు కూడా భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు రూ.కోటి నగదును కలెక్ట్ చేయగలిగాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. గచ్చిబౌలిలోని ఓ ప్రభుత్వ పాఠశాల అధ్వాన్నంగా ఉన్న తీరు చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని హిమాన్షు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు చేసింది మంచి పనే అయినా.. తనకు మైలేజ్ రావడం కోసం రూ.కోటి ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలను బాగుచేయించి ప్రారంభించానని హిమాన్షు చెప్పుకుంటున్నాడు. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ప్రొజెక్ట్ అవుతోంది.

హిమాన్షు చిన్న పిల్లవాడు అని.. అతడి గురించి మీడియా వాళ్లు వార్తలు రాయవద్దని మంత్రి కేటీఆర్ గతంలో పలు మార్లు చెప్పుకొచ్చారు. అతడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కానీ తాను తోపునని చెప్పుకునేందుకు హిమాన్షు ప్రచారం చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలి సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల వార్తను తీసుకుంటే తాను రూ.కోటి ఖర్చుతో ఆధునీకరించి కొత్త సౌకర్యాలతో పాఠశాలను ప్రారంభించినట్లు హిమాన్షునే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో హిమాన్షు పేరు మార్మోగిపోతోంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు తరహాలో హిమాన్షును పోలుస్తూ బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు.

హిమాన్షు చేసే పనులు చిన్నపిల్లల తరహాలో లేకుండా తాను పెద్దవాడినని చెప్పుకునే తరహాలో ఉంటున్నాయని నెటిజన్‌లు చెప్పుకుంటున్నారు. నిజానికి హిమాన్షు ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ కోసంం తన జేబులో నుంచి రూ.కోటి ఖర్చు చేయలేదు. ఫండ్ రైజింగ్ చేశాడు. సీఎం మనవడు, మంత్రి తనయుడు అంటే గొప్ప గొప్ప సంస్థలు కూడా భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు రూ.కోటి నగదును కలెక్ట్ చేయగలిగాడు. సొంత డబ్బులు ఖర్చు చేయకపోయినా తాను గొప్ప పని చేసినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే ప్రభుత్వ పాఠశాలను చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్తూ స్పీచ్ ఇవ్వడం చూసి హిమాన్షు కాస్త ఓవరాక్షన్ చేశాడని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. దీంతో అతడిని ట్రోల్ చేస్తున్నారు. బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై హిమాన్షు చెప్పకనే చెప్పాడంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


ఒకవైపు సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని రంగాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ప్రచారం చేసుకుంటున్న వేళ.. రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న స్కూల్‌ను చూసి సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉందంటే అది ఎవరి వైఫల్యం కిందకు వస్తుందో చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శలుు చేస్తున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంటే ఇప్పుడు స్వయంగా సీఎం మనవడే ప్రభుత్వం పరువు గోదాట్లో కలిపాడంటూ పలువురు భావిస్తున్నారు. కేశవనగర్ స్కూల్ గురించి హిమాన్షు చెప్పినట్లు తెలంగాణలో మిగతా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి కూడా అలాగే ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని.. ఆడపిల్లలు టాయ్‌లెట్లకు వెళ్లాలన్నా జంకుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన సమయంలో కూడా హిమాన్షుపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

Jagan: డేటా స్కాం... జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..!!

Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?

Updated Date - 2023-07-13T15:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising