Adventure With Modi: మోదీతో కలిసి చేసిన సాహసయాత్ర చిత్రాన్ని పంచుకున్న బేర్ గ్రిల్స్

ABN , First Publish Date - 2023-02-28T11:03:27+05:30 IST

బ్రిటీష్ టెలివిజన్ సాహసికుడు బేర్ గ్రిల్స్ మోదీతో కలిసి చేసిన సాహసయాత్ర చిత్రాన్ని తాజాగా ట్విట్టర్‌లో పంచుకున్నారు....

Adventure With Modi: మోదీతో కలిసి చేసిన సాహసయాత్ర చిత్రాన్ని పంచుకున్న బేర్ గ్రిల్స్
Bear Grylls Shares modi Pic

న్యూఢిల్లీ: బ్రిటీష్ టెలివిజన్ సాహసికుడు బేర్ గ్రిల్స్ మోదీతో కలిసి చేసిన సాహసయాత్ర చిత్రాన్ని తాజాగా ట్విట్టర్‌లో పంచుకున్నారు.(Bear Grylls Shares Throwback Pic) 2019వ సంవత్సరంలో డిస్కవరీ ఛానెల్‌లో ప్రముఖ జంగిల్ సర్వైవల్ ప్రోగ్రామ్ ‘‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’’ కోసం చిత్రీకరించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చేసిన సాహసయాత్ర చిత్రాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ఏనుగు పేడ దుర్గంధం మధ్య అడవుల్లో వర్షం, చలిని కూడా ఎదుర్కొంటూ సాగిన నాటి సాహసయాత్ర(Adventure With PM Of India) గురించి బేర్ గ్రిల్స్ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి :Breaking news: తాలిబన్ల చేతిలో ఇద్దరు టాప్ ఇస్లామిక్ స్టేట్ కమాండర్ల హతం

ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో వర్షం కురుస్తున్నప్పుడు నీటి తెప్పలో బేర్ గ్రిల్స్, ప్రధాని మోదీతో కలిసి చేసిన ప్రయాణం ఫోటోను ట్వీట్ చేశారు.(Adventure With Modi)‘‘భారత ప్రధాని మోదీతో వర్షంలో అడవిలో ప్రయాణ సాహస జ్ఞాపకం’’అంటూ శీర్షికతో బేర్ గ్రిల్స్ ట్వీట్ చేశారు. నాటి సాహస యాత్రలో హిమాలయాల్లోకి ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం తాను సాగించిన ట్రిప్‌ల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.

ఇది కూడా చదవండి :Gujarat: వల్సాద్ ఫార్మా కంపెనీలో పేలుడు...ఇద్దరి మృతి, మరో ఇద్దరికి గాయాలు

కుండపోత వర్షం కురుస్తుండగా పెద్ద పెద్ద రాళ్ల మధ్య సాగిన తమ ప్రయాణంలోనూ మోదీ చాలా ప్రశాంతంగా ఉన్నారని బేర్ గ్రిల్స్ నాటి సాహసయాత్ర ప్రయాణాన్ని బేర్ గుర్తు చేసుకున్నారు. మోదీపై బేర్ గ్రిల్స్ పెట్టిన ఈ ట్విట్ కు 48,500 మంది లైక్స్ చేశారు. 3,241 మంది రీ ట్విట్ లు చేశారు.

i

Updated Date - 2023-02-28T11:16:08+05:30 IST