ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bachelor's Life: బ్యాచులర్ కుర్రాళ్ల లైఫ్ ఇలాగే కదా ఉండేది.. అర్ధరాత్రి 12 దాటినా సరే.. అద్దె గదుల్లో కనిపించే సీన్లు ఇవే..!

ABN, First Publish Date - 2023-08-08T16:34:53+05:30

అర్ధరాత్రి ఓ యువకుడు మ్యాగీ వండుకుంటూ బాలీవుడ్ పాటకు మైమరిచిపోయి స్టెప్పులేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మందికి తమ బ్యాచిలర్ లైఫ్‌ను గుర్తు చేస్తోందీ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం లేదా ఉపాధి కోసం ఉన్న ఊరిని కన్నవారిని వదిలిపెట్టి పట్టణాల బాట పడుతోంది నేటి యువత! దీంతో, అప్పటివరకూ అలవాటయిన జీవితం ముగిసిపోతుంది. ఓ కొత్త లైఫ్ స్టైల్(Bachelor life style) మొదలవుతుంది. అద్దె గదులు..పొద్దుపోయే దాకా బయట తిరిగి రావటాలు.. అర్ధరాత్రి వండుకుని తినడాలు.. అబ్బో.. ఈ లైఫ్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బ్యాచిలర్ కుర్రాళ్లు చాలా మందికి ఈ లైఫ్ తెలిసిందే. అయితే, ప్రస్తుతం జీవితంలో సెటిలై కుదురుగా బతుకుతున్న వారికి కూడా పాత రోజుల్నీ గుర్తుకు తెస్తూ కాలుకదిపేలా చేస్తోంది ఓ వీడియో(Viral Video).


వీడియోలో ఓ బ్యాచిలర్ యువకుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పాటలు వింటూ నూడుల్స్ వండుతుండగా అతడి రూం మేట్ ఈ దృశ్యాల్ని రికార్డు చేశాడు(Bachelor making maggie at 12.00am). ఓవైపు పాటకు ఊగిపోతూనే మనోడు నూడుల్స్‌లో మసాలాలు కలిపేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటాడు. తన రూం మేట్ రికార్డు చేస్తున్నాడని తెలియగానే మరింతగా రెచ్చిపోయి డ్యాన్స్ చేశాడు.


షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలోని దర్దే డిస్కో పాటకు అతడు ఊగిపోతూ స్టెప్పులేసిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అనేక మంది తమ బ్యాచిలర్ రోజుల్ని గుర్తుకు తెచ్చింది. తెల్లవారుజామైనా, అర్ధరాత్రి 12 గంటలైనా నూడుల్స్ వండుకుని తినాల్సిందే, బ్యాచిలర్ లైఫ్ అంటే ఇదే అంటూ అనేక మంది కామెంట్ చేస్తున్నారు. బ్యాచిలర్స్ ఉండే అద్దెగదుల్లో ఉండే సీన్స్ ఇవే అని ముక్తకంఠంతో చెబుతున్నారు. మది నెట్టింట ఇంతలా వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరే ఓమారు చూసేయండి మరి!

Updated Date - 2023-08-08T16:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising