Share News

Viral: అందం మాటున దాగి ఉన్న క్రూరత్వం.. ప్రియుడిని ఇంటికి పిలిచి.. ముక్కలు ముక్కలుగా నరికిన ఈ యువతి కథేంటంటే..!

ABN , First Publish Date - 2023-11-29T18:22:24+05:30 IST

ఆమె అందమైన యువతి.. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో నివసిస్తుండేది.. ఆమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.. కూతురిని బాగా చదివించాలనుకున్నాడు.. జైపూర్‌లో ఉంచి నెల నెలా డబ్బులు పంపిస్తూ చదివించేవాడు.. అయితే ఆ యువతి మాత్రం విలాసాలకు అలవాటు పడింది..

Viral: అందం మాటున దాగి ఉన్న క్రూరత్వం.. ప్రియుడిని ఇంటికి పిలిచి.. ముక్కలు ముక్కలుగా నరికిన ఈ యువతి కథేంటంటే..!

ఆమె అందమైన యువతి.. రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో నివసిస్తుండేది.. ఆమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.. కూతురిని బాగా చదివించాలనుకున్నాడు.. జైపూర్‌లో ఉంచి నెల నెలా డబ్బులు పంపిస్తూ చదివించేవాడు.. అయితే ఆ యువతి మాత్రం విలాసాలకు అలవాటు పడింది.. చివరకు వ్యభిచారంలోకి దిగింది.. టిండర్ యాప్ (Tinder App) ద్వారా చాలా మంది అబ్బాయిలతో పరిచయం పెంచుకుని వారిని బెదిరించి డబ్బులు తీసుకునేది.. చివరకు ఓ యువకుడిని ట్రాప్ చేసి హత్యకు కూడా పాల్పడింది.. ఆ కేసులో రాజస్థాన్ కోర్టు (Court) తాజాగా తుది తీర్పు వెలువరించింది.. నిందితుతరాలికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది (Crime News).

జైపూర్‌లోని (Jaipur) ఝోత్వారా ప్రాంతంలో నివసించే ప్రియా సేథ్ అనే యువతి 2018లో టిండర్ యాప్ ద్వారా దుష్యంత్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అతడిని మెల్లిగా ట్రాప్ (Trap) చేసింది. నిజానికి అప్పటికే ప్రియ మరో యువకుడితో ప్రేమలో ఉంది. మరోవైపు దుష్యంత్‌తో కూడా అఫైర్ మొదలుపెట్టింది. ప్రియను ఇంప్రెస్ చేయడానికి దుష్యంత్ తన స్నేహితుడి కారులో వచ్చి బాగా ధనవంతుడిలా కనిపించేవాడు. దీంతో ప్రియ.. దుష్యంత్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసింది. 2018 మే నెలలో దుష్యంత్‌ను తన ఇంటికి పిలిచింది. తన ఇద్దరు స్నేహితుల సహాయంతో దుష్యంత్‌ను కిడ్నాప్ చేసింది.

Father: కంగారుగా ఇంటికొచ్చిన తండ్రి.. చేతులకు అంటిన రక్తం.. పక్కన అక్క లేకపోవడంతో చిన్న కూతురికి డౌట్.. చివరకు..!

దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ గురించి చెప్పింది. రూ.10 లక్షలు ఇస్తేనే వదులుతామని బెదిరించింది. దుష్యంత్ తండ్రికి అంత స్థోమత లేదు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రియ, ఆమె స్నేహితులు కలిసి దుష్యంత్‌ను హత్య చేశారు. శరీరాన్ని అనేక ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో ప్యాక్ చేసి ఢిల్లీ హైవేపై నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశారు. డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు విచారణ ప్రారంభించి చివరకు ప్రియ సేథ్‌ వరకు వచ్చారు. మొదట అనేక తప్పుడు సమాధానాలు చెప్పిన ప్రియ చివరకు తన తప్పును అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు ప్రియకు, హత్యకు సహకరించిన ఆమె ఇద్దరు స్నేహితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Updated Date - 2023-11-29T18:22:26+05:30 IST