ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: పెళ్లయిన కొద్ది గంటలకే ఇలా జరిగిందేంటి..? కాసేపట్లో వరుడితో కలిసి వధువు అత్తారింట్లో అడుగు పెడుతుందనగా..!

ABN, First Publish Date - 2023-06-26T20:45:47+05:30

రాజస్థాన్‌లోని నగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహ వేడుక తర్వాత విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇద్దరు ఫొటోగ్రాఫర్లు వివాహ వేడుక మొత్తాన్ని తమ కెమేరాలతో కవర్ చేశారు. వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజస్థాన్‌ (Rajasthan)లోని నగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహ (Marriage) వేడుక తర్వాత విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇద్దరు ఫొటోగ్రాఫర్లు (Photographers) వివాహ వేడుక మొత్తాన్ని తమ కెమేరాలతో కవర్ చేశారు. వధూవరులను వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు. వివాహం అనంతరం వధూవరులు అత్తింటికి బయల్దేరారు. వధువు అత్తింట్లో అడుగు పెట్టే ఘట్టాన్ని కెమేరాలో బంధించాలని ఆ ఫొటోగ్రాఫర్లు అనుకున్నారు. వధూవరుల కంటే ముందే ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది (Crime News).

నాగౌర్ జిల్లాలోని రియామండికి చెందిన కైలాష్ చంద్ర, అతని స్నేహితుడు ఫిరోజ్ మహ్మద్ ఫోటోగ్రఫీ పని చేసేవారు. వివాహాల్లో ఫొటోలు, వీడియోలు తీసేవారు. ఆదివారం రాత్రి పెళ్లిలో ఫొటోలు తీశారు. వివాహం తర్వాత వధూవరులు ఇంటికి బయల్దేరారు. అత్తింట్లో వధువు అడుగు పెట్టే ఘట్టాన్ని కెమేరాలో బంధించాలని భావించారు. వారి కంటే ముందే ఇంటికి చేరుకునేందుకు బైక్ ఎక్కారు. అయితే మార్గమధ్యంలో వారి బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదం (Road Accident)లో ఇద్దరి శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరూ స్పాట్‌లోనే మరణించారు.

Marriage: ఒకే మండపంలో ఇద్దరు వధువులు.. పెళ్లి కొడుకు మాత్రం ఒక్కడే.. ఈ ప్రేమ పెళ్లికి బంధువులంతా సాక్షులే..!

ఫిరోజ్ మీద అతడి తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఫిరోజ్ చనిపోయాడనే వార్త విని ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కైలాష్‌కు నాలుగు నెలల క్రితమే పెళ్లి జరిగింది. ఇంతలోనే కైలాష్ మరణ వార్త కుటుంబాన్ని కలిచి వేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్ల మరణ వార్త విని వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కూడా నివ్వెరపోయారు.

Updated Date - 2023-06-26T20:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising