Bride: కూతురి పెళ్లిలో ఓ తండ్రి షాకింగ్ నిర్ణయం.. వధువును అక్కడే ఆగమని చెప్పి.. బంధువుల్లో ఉన్న ఓ వ్యక్తిని పిలిచి..!
ABN, First Publish Date - 2023-07-04T17:38:34+05:30
ఓ అమ్మాయి పెళ్ళి వేడుకలో ఆమె వేదిక మీదకు వెళుతుండగా ఆమె తండ్రి ప్రవర్తించిన విధానం అక్కడ అందరినీ షాక్ కు గురిచేసింది. 'అక్కడే ఆగు ముందుకు రావద్దు' అని కూతుర్ని వారించి..
ప్రపంచ దేశాలలో ఎన్ని సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా వివాహానికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల సమక్షంలో పెళ్ళివేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. కానీ ఇదే పెళ్ళి వేడుకలలో ఊహించని సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఓ అమ్మాయి పెళ్ళి వేడుకలో ఆమె వేదిక మీదకు వెళుతుండగా ఆమె తండ్రి ప్రవర్తించిన విధానం అక్కడ అందరినీ షాక్ కు గురిచేసింది. 'అక్కడే ఆగు ముందుకు రావద్దు' అని కూతుర్ని వారించి అతని తన బంధువులలో ఉన్న ఒక వ్యక్తిని ముందుకు పిలిచాడు. అతనెందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక అక్కడ అందరూ అయోమయానికి గురయ్యారు. ఆ తరువాత జరిగింది చూసి ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
సంస్కృతి సంప్రదాయాలను బట్టి పెళ్ళిళ్లు(marriages) కూడా విభిన్న పద్దతులలో జరుగుతాయి. విదేశాల్లో అంతా క్రిస్టియన్స్ ఏ ఉండటంతో అక్కడంతా చర్చిలలో పాస్టర్ల సమక్షంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇంగ్లాండ్(England) కు చెందిన అమీ వాకిన్ షా పెళ్ళిలో అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. క్రిస్టియన్స్ వివాహాల(christians marriages) ప్రకారం వధువు తండ్రితో కలసి నడుస్తూ పెళ్ళి వేదిక దగ్గరకు చేరుకుంటుంది. అమీ కూడా తన పెళ్ళి వేడుకలో ఇదే చెయ్యాల్సి ఉంది. కానీ ఆమె వెంట నడవడానికి ఆమెకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. అమీ చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి నుండి ఆమె తల్లి విడిపోయింది. ఆ తరువాత అమీ తల్లి జెఫ్ బెన్నెట్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అప్పటినుండి జెఫ్ బెన్నెట్ అమీకి సవతి తండ్రి(step father) అయ్యాడు. జెఫ్ బెన్నట్ అమీని సొంత కూతురులానే చూసుకున్నాడు. భార్య నుండి విడిపోయినా అమీ కన్నతండ్రి(father) ఆండీ కాల్సిన్ అమీ బాగోగుల గురించి ఎప్పటికప్పుు కనుక్కునేవాడు. దీంతో ఇద్దరు తండ్రుల(two fathers) మధ్య అమీ ఏ లోటూ లేకుండా పెరిగింది.
Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్ను ఓపెన్ చేసి చూస్తే..!
ఇంగ్లాండ్ లో ర్యాన్ అనే వ్యక్తితో తన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు అమీ తన కన్నతండ్రితో తన మనసులో మాట బయటపెట్టింది. 'వేదిక వద్దకు వెళ్లేటప్పుడు మీతోపాటు జెఫ్ బెన్నెట్ నాన్న కూడా నాతో వేదకి వద్దకు రావాలి. మీరిద్దరూ కలసి నన్ను వేదిక వద్దకు తీసుకెళ్ళాలి' అని అడిగింది. అమీ కన్నతండ్రి కూతురి మాటను ఖండిచలేదు. 'నీ సంతోషం కంటే నాకింకేం కావాలి' అంటూ ఒప్పేసుకున్నాడు. పెళ్ళిరోజు వేదిక దగ్గరకు వెళ్ళాల్సిన కూతురితో 'అక్కడే ఆగు ముందుకు రావద్దు' అని హెచ్చరించాడు. ఆ తరువాత జెఫ్ బెన్నెట్ ను రమ్మని పిలిచాడు. స్వయంగా తనే చేత్తో అతని చెయ్యి పట్టుకుని కూతురి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఇద్దరు తండ్రులు చెరొకవైపు చేరి అమీని ఎంతో జాగ్రత్తగా వేదిక వద్దకు తీసుకెళ్ళారు. పెళ్ళికి విచ్చేసిన అతిథులు, బంధువులు, స్నేహితులు అందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. వారి ప్రేమకు, వారు ఒకరినొకరు అర్థం చేసుకున్న విధానానికి ఫిదా అయిపోయారు.
Viral News: ఎవరీ అమ్మాయి..? 12 ఏళ్లకే రూ.410 కోట్లకు ఓనర్.. ఇంట్లో కూర్చునే ప్రతీ నెలా లక్షలు సంపాదిస్తోందిగా..!
Updated Date - 2023-07-04T17:38:34+05:30 IST