Bus Journey: ఈ పాపం ఎవరిది..? బస్సు జర్నీల్లో పిల్లలను తీసుకెళ్తున్నారా..? 4 ఏళ్ల ఈ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!
ABN , First Publish Date - 2023-10-27T16:15:23+05:30 IST
ఓ భార్యాభర్తల జంట తమ 4ఏళ్ళ కొడుకును తీసుకుని బస్సులో ప్రయాణమయ్యారు. కానీ ఒకే ఒక తప్పిదం కారణంగా ఆ 4ఏళ్ళ పిల్లాడు దారుణ స్థితిలో మృతి చెందాడు.
ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న కాలమిది. ఇంటి నుంచి అడుగు బయట పెడితే తిరిగి సురక్షితంగా ఇంటికి చేరతామా లేదా అనే నమ్మకం ఉండదు. కానీ బయటకు వెళ్లకపోతే పనులు జరగవు. కొన్నిసార్లు చిన్నపిల్లలను కూడా వెంటతీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఓ భార్యాభర్తల జంట కూడా తమ 4ఏళ్ళ కొడుకును తీసుకుని బస్సులో ప్రయాణమయ్యారు. కానీ ఒకే ఒక తప్పిదం కారణంగా ఆ 4ఏళ్ళ పిల్లాడు దారుణ స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన ఇప్పుడు నెటిజన్లను కలచివేస్తోంది. ప్రమాదానికి గల కారణం తెలిసి సోషల్ మీడియా మొత్తం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రం బాంద్రా జిల్లాలో హరిపూర్ గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి పెళ్ళై 4ఏళ్ల కొడుకున్నాడు. రమేష్ తన భార్య, కొడుకుతో కలసి సహార్ గఢ్ ప్రాంతంలో నివసిస్తున్న తెలిసిన వ్యక్తిని కలవడానికి బయలుదేరాడు. భన్వర్ ఘర్ స్టాప్ లో తన భార్య,కొడుకుతో కలసి బస్సు ఎక్కాడు. వారు బస్సు ఎక్కగానే నేరుగా వెళ్ళి ఖాళీగా ఉన్న ఒక సీటు దగ్గర కూర్చున్నారు. అయితే ఆ సీటు కింద బస్సు ఫ్లోర్ కు పెద్ద రంధ్రం పడింది. ఆ రంధ్రం చూసిన రమేష్ భయపడ్డాడు. వెంటనే కండక్టర్ ను కలసి రంధ్రం గురించి ప్రస్తావించి తమకు వేరే సీటు కేటాయించాలని అడిగాడు. బస్సు కండక్టర్ రమేష్ మాటలు పట్టించుకోలేదు. 'వేరే సీటు లేదు, అక్కడే కూర్చోండి' అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో రమేష్ దంపతులు పిల్లాడితో కలసి అక్కడే కూర్చున్నారు. రమేష్ భార్య పిల్లాడిని తన ఒడిలో జాగ్రత్తగా కూర్చొబెట్టుకుంది. కానీ ఆ పిల్లాడు ఒక్కసారిగా తల్లి ఒడిలోనుండి కిందకు దిగాడు. అతను అలా దిగడంతోనే కింద ఉన్న రంధ్రంలో పడిపోయాడు(4years boy fall in the road in to bus hole).
Curd: పెరుగును ఇలా కూడా వాడొచ్చని కలలో కూడా ఊహించి ఉండరు.. జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే పెరుగుతో..!
పిల్లాడు కింద పడటంతో రమేష్ భార్య పెద్దగా కేకలు వేసింది. ఆమె కేకలకు బస్సులో గందరగోళం ఏర్పడింది. వెంటనే బస్సును నిలిపేశారు. హుటాహుటిన బస్సు దిగి చూడగా పిల్లాడు వెనుక టైర్ కింద నలిగిపోయాడు. రమేష్ భార్య పరిగెత్తుకుంటూ వెళ్లి బిడ్డను ఎత్తుకోగా ఊపిరితీసుకుంటున్నట్టు అనిపించింది. దీంతో అప్పటికప్పుడే హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. కానీ అప్పటికే పిల్లాడు మృతిచెందాడని పిల్లాడిని పరీక్షించిన వైద్యులు తెలిపారు. కండక్టర్, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బస్సును సీజ్ చేసి కండక్టర్, డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు.