Cow Video: వరదలో కొట్టుకుపోతున్న లేగదూడ.. ఎవరూ కాపాడలేని పరిస్థితి.. ప్రాణాలతో ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2023-06-27T14:26:57+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Cow Video: వరదలో కొట్టుకుపోతున్న లేగదూడ.. ఎవరూ కాపాడలేని పరిస్థితి.. ప్రాణాలతో ఎలా బయటపడిందంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజుకు కొన్ని వందల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుని బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో వేగంగా నీటిలో కొట్టుకుపోతున్న ఆ లేగదూడ (Calf)ను ఓ క్రేన్ ఆపరేటర్ (Crane Operator) కాపాడాడు. ఆ షాకింగ్ వీడియోపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

@WallStreetSilv అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కాలువ గుండా నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఆ కాలువలో ప్రమాదవశాత్తూ ఓ లేగదూడ పడిపోయింది. నీటి వేగానికి అది కాలువలో కొట్టుకుపోతోంది. ఆ సమయంలో ఓ క్రేన్ ఆపరేటర్ ఆ కాలువ నుంచి ఆ లేగ దూడను బయటకు తీశాడు. అద్భుతమైన టైమింగ్‌తో ఆ లేగదూడను కాపాడాడు. లేకపోతే అది మరింత ముందుకు కొట్టుకుని వెళ్లిపోయేది. ఈ ఘటన టర్కీ (Turkey)లో జరిగింది.

Marriage: పెళ్లయిన కొద్ది గంటలకే ఇలా జరిగిందేంటి..? కాసేపట్లో వరుడితో కలిసి వధువు అత్తారింట్లో అడుగు పెడుతుందనగా..!

ఆ ఘటనను వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను ఇప్పటివరకు 65 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 76 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``క్రేన్ ఆపరేటర్ టైమింగ్ అద్భుతం``, ``క్రేన్ ఆపరేటర్ చాలా మంచి పని చేశారు`` అని కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-27T14:26:57+05:30 IST