Viral: గర్ల్‌ఫ్రెండ్‌కు తెలీకుండానే ఆమె కడుపు తీసేసిన డాక్టర్.. తల్లికాబోతున్నానని ఆమె చెప్పాక పక్కా ప్లాన్ వేసి..
ABN , First Publish Date - 2023-10-24T20:41:44+05:30 IST
తాను గర్భం దాల్చిన విషయం ప్రియుడికి చెప్పిన ఓ మహిళకు చివరకు భారీ షాక్ తగిలింది. స్వయంగా డాక్టర్ అయిన ప్రియుడు చేసిన పనికి ఆమె కడుపు పోగొట్టుకోవాల్సి వచ్చింది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమికుడితో జీవితం సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఆమె గర్భం దాల్చింది. తల్లికాబోతున్నందుకు సంబరపడిపోతూ ఈ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌తో పంచుకుంది. అతడూ సంతోషిస్తాడనుకుంది. ఆ నమ్మకమే చివరకు ఆమె లైఫ్‌ను తలకిందులు చేసింది. స్వయంగా డాక్టర్ అయినా మహిళ బాయ్‌ఫ్రెండ్ కడుపు తీసేసేందుకు చేసిన పని ప్రస్తుతం చైనాలో సంచలనంగా మారింది.
USA: ఎల్-1 వీసాలకు వాళ్లు అర్హులు కాదు.. క్లారిటీ ఇచ్చిన అమెరికా
Canada Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్!
పూర్తి వివరాల్లోకి వెళితే, వాంగ్ అనే మహిళకు (34) 2021లో ఓ డాక్టర్‌తో ప్రేమలో పడింది. అతడు ఓ యూరాలజిస్ట్. అతడు తనకు సరిజోడు అని భావించిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు అన్ని విధాలా దగ్గరైంది. ఈ ఏడాది మే నెలలో గర్భం దాల్చచిన ఆమె సంబరపడిపోతూ బాయ్‌ఫ్రెండ్‌తో ఈ విషయాన్ని చెప్పింది. అతడూ ఎగిరి గంతేస్తాడని అనుకుంది. కానీ, అతడు మాత్రం తనకు బిడ్డలు వద్దని ససేమిరా చెప్పేశాడు. అబార్షన్ చేయించుకోమని సూచించాడు. వాంగ్ మాత్రం అతడి సూచనను తిరస్కరించింది. బిడ్డను కంటానని ఖరాకండీగా చెప్పేసింది. అప్పటికి ఆ డాక్టర్ మౌనంగానే ఉండిపోయాడు. లోలోపల పెద్దకు కుట్రను సిద్ధం చేసుకున్నాడు(China Doctor Secretly Gives Girlfriend Abortion Pills To Terminate Her Pregnancy).
Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. అక్కడి సీన్ చూసి..
ఆ తరువాత ఓ రోజు ఓ రోజు వారిద్దరూ రెస్టారెంట్‌లో కలుసుకున్న సందర్భంగా ఆమెకు తెలీకుండా అబార్షన్ పిల్స్ కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. మరుసటి రోజు ఫోన్ చేసి ఆమె బాగోగులు కనుక్కోగా తనకు అంతా బానే ఉందని ఆమె చెప్పింది. ఈ క్రమంలో మరోసారి డేట్ కోసం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ మరునాడు నిద్రలేచిన ఆమె తనకు కాస్త నీరసంగా ఉందని చెప్పడంతో మళ్లీ అబార్షన్ కలిపి ఉన్న పానీయాన్ని ఇచ్చాడు. మరుసటి రోజుకల్లా ఆమెకు బ్లీడింగ్ అయి కడుపు కోల్పోయింది. ఆ తరువాత తానేం చేసిందీ చెప్పుకొచ్చిన డాక్టర్ ప్రియుడు తనను క్షమించాలని వేడుకున్నాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా ప్రతిపాదించాడు. కానీ, అతడి నైజం అర్థం చేసుకున్న ఆమె చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం, బాధితురాలు ఈ ఘటన గురించి నెట్టింట పంచుకోవడంతో చైనాలో ఇది వైరల్‌గా(Viral News) మారింది.
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
ఆకలితో ఉన్న మొసళ్లతో వ్యక్తి చెలగాటం.. తాడు పట్టుకుని పైనుంచి వేళాడుతుండగా..