ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: బిగ్గరగా కేకలు పెడుతున్న ప్రయాణీకులు.. అనుమానంతో వెనక్కు చూసి అవాక్కైన డ్రైవర్..!

ABN, First Publish Date - 2023-12-04T18:57:20+05:30

బోగీల మధ్య కప్లింగ్ తెగిపోవడంతో చంబల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: అప్పటివరకూ ప్రశాంతంగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఊహించని ట్విస్ట్! ఆ రైలు అకస్మాత్తుగా రెండుగా విడిపోయింది. ఇంజిన్‌తో పాటూ కొన్ని బోగీలు ముందుకు వెళ్లిపోతే..మిగితా బోగీలు వెనక నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

చంబల్ ఎక్స్‌ప్రెస్(Chambal express train) శనివారం గ్వాలియర్ నుంచి బయలుదేరింది. అయితే, మధ్యాహ్నం 3 గంటల సమయంలో బందా స్టేషన్ సమీపంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. రైలు వేగంగా ముందుకెళుతున్న సమయంలో బందా స్టేషన్ సమీపంలో ఎస్6, ఎస్7 బోగీల మధ్య కప్లింగ్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో, ముందున్న బోగీలు కొన్ని రైలుతో పాటూ ముందుకెళ్లిపోయాయి(Train seperated into two). కిటికీలోంచి తొంగి చూసిన కొందరు ప్రయాణికులు ఈ షాకింగ్ దృశ్యం చూసి దిమ్మెరపోయారు.


ఈలోపు విషయం డ్రైవర్ దృష్టికి వెళ్లడంతో అతడు వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఆపేశారు. ఆ తరువాత టెక్నికల్ టీంకు సమాచారం అందించడంతో వారు కాసేపటికి ఘటనాస్థలానికి చేరుకుని కప్లర్‌ను సరిచేశారు. అనంతరం, రైలు యథాప్రకారం ప్రయాణం కొనసాగించింది. అయితే, ఈ ఘటనతో ఝాన్సీ బందా రైల్వే పరిధిలో సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో, పలు రైళ్లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నాయి.

Updated Date - 2023-12-04T18:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising